Jhulan Goswami : ఝుల‌న్ గోస్వామి సంచ‌ల‌నం

అరుదైన రికార్డు సాధించిన క్రికెట‌ర్

Jhulan Goswami : భార‌త వెట‌ర‌న్ పేస‌ర్ ఝుల‌న్ గోస్వామి రికార్డ్ సృష్టించింది మ‌రోసారి. ప్ర‌పంచ విమెన్స్ క్రికెట్ లో 200 వ‌న్డేలు ఆడిన తొలి బౌల‌ర్ గా నిలిచింది. మ‌హిళ‌ల ప్ర‌పంచ‌కప్ లో భాగంగా ఆసిస్ తో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త జ‌ట్టు పోరాడింది.

మ‌రో వైపు హైద‌రాబాదీ స్టార్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ 230 వ‌న్డేలు ఆడిన ప్లేయ‌ర్ గా చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సార్లు వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడిన క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించారు.

ఇప్ప‌టికే ఝుల‌న్ గోస్వామి(Jhulan Goswami) వ‌ర‌ల్డ్ లోనే 250 వికెట్లు తీసిన మ‌హిళా బౌల‌ర్ గా నిల‌వ‌డం విశేషం. మిథాలీ రాజ్ ఆరోసారి వ‌ర‌ల్డ్ లో ఆడుతుండ‌గా ఝుల‌న్ గోస్వామి వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడ‌డం ఇది ఐద‌వ సారి.

2005లో ఆమె మొద‌టి సారి వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడింది. కంటిన్యూగా ఆడుతూ వ‌స్తోంది ఝుల‌న్ గోస్వామి(Jhulan Goswami). అంతే కాకుండా ఈసారి జ‌రుగుతున్న మహిళా వ‌ర‌ల్డ్ క‌ప్ ద్వారా 40 వికెట్లు తీసి అరుదైన బౌల‌ర్ గా రికార్డ్ సృష్టించింది.

ఇదిలా ఉండ‌గా ఇవాళ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది మిథాలీ రాజ్. 77 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసింది. ఇదే ఆమె ఆఖ‌రి టోర్నీ కాబోతోంది.

ఆ త‌ర్వాత తాను మ‌హిళా క్రికెట్ ప్ర‌పంచం నుంచి నిష్క్ర‌మించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అందరిని విస్తు పోయేలా చేసింది. వ‌న్డేల ప‌రంగా చూస్తే మిథాలీ రాజ్ ఇది 63వ హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. అంతే కాకుండా మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ లో 12 హాఫ్ సెంచ‌రీలు చేయ‌డం విశేషం.

Also Read : కిర్మానితో అజ్బూ భాయ్ ముచ్చ‌ట

Leave A Reply

Your Email Id will not be published!