Delhi Doha Flight : ‘ఢిల్లీ..దోహా’ విమానం దారి మ‌ళ్లింపు 

సాంక‌తిక కార‌ణాల‌తో క‌రాచీకి 

Delhi Doha Flight  : ఢిల్లీ నుంచి దోహాకు వెళుతున్న ఖ‌తార్ ఎయిర్ వేస్ (Delhi Doha Flight )విమానాన్ని దారి మ‌ళ్లించారు. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల పాకిస్తాన్ లోని క‌రాచికి మ‌ళ్లించారు. ఖ‌తార్ ఎయిర్ (Qatar Airways) వేస్ క్యూ ఆర్ 579 విమానంలో 100 మందికి పైగా ప్ర‌యాణికులు ఉన్నారు.

ప‌రిస్థితిపై ఫిర్యాదు చేసేందుకు కార్డియాల‌జిస్ట్ ట్వీట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. క్యూఆర్ 579 విమానాన్ని క‌రాచీకి మ‌ల్లించారు. ఎందుకు మ‌ళ్లించార‌నే దానికి స‌మాధానం లేదు. ప్ర‌యాణికుల‌కు ఆహారం, నీళ్లు కూడా ఇవ్వ‌వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

క‌స్ట‌మ‌ర్ కేర్ కూడా స్పందించ లేదని ఆరోపించారు. ద‌య‌చేసి సాయం చేయ‌మంటూ డాక్ట‌ర్ స‌మీర్ గుప్తా ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. ఒక వీడియో సందేశంలో మ‌రో ప్ర‌యాణికుడు ర‌మేష్ రాలియా సైతం స్పందించాడు.

చాలా మందికి దోహా (Delhi Doha Flight )నుండి క‌నెక్టింగ్ విమానాలు ఉన్నాయి. అయితే క‌రాచీ నుంచి విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుంద‌నే దాని గురించి త‌మ‌కు ఇంత వ‌ర‌కు స‌మాధానం కానీ స‌మాచారం కానీ ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు.

ఇదిలా ఉండగా సోమ‌వారం తెల్ల వారుజామున 3.50 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి దోహాకు ఖ‌తార్ ఎయిర్ (Qatar Airways Flight) వేస్ కు చెందిన ఫ్ల‌యిట్ బ‌య‌లు దేరింది. ఉద‌యం 5.30 గంట‌ల‌కు క‌రాచీలో దిగింద‌ని మిస్ట‌ర్ రాలియా వెల్ల‌డించారు.

ల్యాండింగ్ అయ్యాక విమానాశ్ర‌యం వ‌ద్ద వేచి ఉండేలా చేశార‌ని వాపోయాడు. విమానం ఎప్పుడు బ‌య‌లు దేరుతుందో చెప్ప‌డం లేదు. మ‌హిళ‌లు, పిల్ల‌లు ఉన్నార‌ని తెలిపాడు.

విష‌యం తెలిసిన వెంట‌నే కేంద్ర విమానయాన సంస్థ ఆరా తీస్తోంది (Central Airlines).

Also Read : ‘ఢిల్లీ..దోహా’ విమానం దారి మ‌ళ్లింపు

Leave A Reply

Your Email Id will not be published!