BAN vs SA 3rd ODI : స‌ఫారీ గ‌డ్డ‌పై బంగ్లా భ‌ళా

వ‌న్డే సీరీస్ కైవ‌సం

BAN vs SA 3rd ODI : ప్ర‌పంచంలో టాప్ జ‌ట్టుగా పేరొందిన ద‌క్షిణాఫ్రికాపై అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది ప‌సికూన‌లుగా భావించిన బంగ్లాదేశ్. కెరీర్ ప‌రంగా ఆ జ‌ట్టు అరుదైన రికార్డును స్వంతం చేసుకుంది.

ఒక ర‌కంగా వ‌ర‌ల్డ్ లోనే మోస్ట్ పాపుల‌ర్ జ‌ట్టుగా పేరొందిన భార‌త జ‌ట్టు స‌ఫారీ పై చేతులెత్తేసింది.  కానీ బంగ్లా దేశ్ మాత్రం ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది.

త‌మ దేశంలో కాదు వారి దేశంలోనే ఆడి భ‌ళా అనుకునేలా చేసింది.  అందుకే క్రికెట్ ఆట‌కు అంత క్రేజ్. ఎప్పుడు ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌డం క‌ష్టం.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ కంటే అన్ని ఫార్మాట్ ల‌లో స‌ఫారీ టీం బ‌లంగా ఉంది.

కానీ ఆట‌లో చేతులు ఎత్తేసింది. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించింది పిల్ల కూన బంగ్లా. తొలిసారి వ‌న్డే సీరీస్ కైవ‌సం చేసుకుని త‌న‌కు ఎదురు లేద‌ని చాటింది. 

దీంతో మూడు వ‌న్డేల సీరీస్(BAN vs SA 3rd ODI ) లో భాగంగా 2-1 తేడాతో గెలుపొంది అరుదైన ఘ‌న‌త సాధించింది.ఇక రెండు జ‌ట్లు స‌రి స‌మానంగా ఉన్న‌ప్ప‌టికీ మూడో వ‌న్డే కీల‌కంగా మారింది. 

ఈ మ్యాచ్ లో ఏకంగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుపై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ముందు టాస్ గెలిచిన స‌ఫారీ బ్యాటింగ్ కు దిగింది. 37 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

బంగ్లాదేశ్ బౌల‌ర్ త‌స్కిన్ అహ్మ‌ద్ కొట్టిన దెబ్బ‌కు ఠారెత్తి పోయింది స‌ఫారీ.

ఇక బ్యాట‌ర్ల‌లో జ‌న్నెమాన్ 39 ర‌న్స్ చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ష‌కీబ్ అల్ హ‌స‌న్ 2 , ఇస్లాం, హ‌స‌న్ చెరో వికెట్ తీశారు.

ఇక 155 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన బంగ్లా దేశ్ జ‌ట్టు కేవ‌లం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.

బంగ్లా స్కిప్ప‌ర్ త‌మీమ్ ఇక్బాల్ ఏకంగా 87 ప‌రుగులు చేసి దుమ్ము దులిపాడు. నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి.

Also Read : ఐపీఎల్ ఫ్యాన్స్ కు తీపిక‌బురు

Leave A Reply

Your Email Id will not be published!