Sanju Samson : కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సంబురం రానే వచ్చింది. ముంబై వేదికగా జరగనున్న (IPL 2022) ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో 10 జట్లు పాల్గొంటున్నాయి. 15వ సీజన్ లో జరుగుతున్న ఈ లీగ్ వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని బీసీసీఐకి సమకూర్చి పెడుతోంది.
ఇక ఒక్కో జట్టుది ఒక్కో ప్రత్యేకత. ఆయా జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఇందులో భాగంగా ముందుగా చెప్పు కోవాల్సింది సంజూ శాంసన్ (Sanju Samson )గురించి. టార్చ్ బేరర్ గా స్టార్ హిట్టర్ గా పేరుంది.
ఎలాంటి ఇబ్బంది లేకుండానే రిస్క్ తీసుకోకుండా అలవోకగా షాట్స్ ఆడడంలో దిట్ట. కళ్లు చెదిరే కళాత్మకతతో నిండిన షాట్స్ అతడి నుంచి చూడొచ్చు. ఒక్కసారి మైదానంలో కూరుకున్నాడంటే పరుగులు వరదలా పారుతాయి.
రెండో సారి కెప్టెన్ గా రాజస్తాన్ రాయల్స్ టీమ్ కు స్కిప్పర్ గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్ లో పరుగులు చేయడంలో టాప్ లో ఉన్నాడు. కానీ జట్టును గట్టెక్కించ లేక పోయాడు. ఈ సారి ఏం చేస్తాడనేది వేచి చూడాలి.
ఇదిలా ఉండగా మనోడి బ్రాండ్ వాల్యూ మాత్రం మామూలుగా లేదు. సంజూ విశ్వనాథ్ శాంసన్ (Sanju Samson )పూర్తి పేరు. 1994 నవంబర్ 11న పుట్టాడు. వయసు 27 ఏళ్లు. రూ. 14 కోట్లు వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals team) యాజమాన్యం రిటైన్ చేసుకుంది.
పలు కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నాడు. గతంలో ఎంఆర్ఎఫ్, కూకాబర్ , ఎస్ఎస్ , గిల్లెట్ వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ప్రస్తుతం ఎస్జీతో ఒప్పందం చేసుకున్నాడు.
హీల్ అనే వెల్ నెస్ కూడా పని చేస్తున్నాడు. సంజూ శాంసన్ నికర సంపాదన ఏడాదికి రూ. 52 కోట్లు అని ఖేల్ తక్ అంచనా వేసింది. ప్రాథమిక అంచనా మాత్రమే.
Also Read : రన్స్ మారథాన్ కేఎల్ రాహుల్