Shreyas Iyer : ముంబై వేదికగా జరుగుతున్న (IPL 2022) ఐపీఎల్ 2022 లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందాడు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) . ఎలాంటి పరిస్థితుల్లో నైనా సరే ఆట స్వరూపాన్ని మార్చేసే సత్తా ఉన్న ప్లేయర్.
ఒక్కసారి కుదురు కోవడం మొదలు పెట్టాడంటే ఇక అతడిని పెవిలియన్ కు పంపించడం కష్టం.
చాలా మటుకు ప్రత్యర్థులు వెంటనే అవుట్ చేయాలని అనుకుంటారు. ఐపీఎల్ (IPL mega auction) మెగా వేలం పాట -2022లో అత్యధిక ధర కు అమ్ముడు పోయాడు.
అందరినీ విస్తు పోయేలా చేశాడు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer). 1994 డిసెంబర్ 6న ముంబైలో పుట్టిన అయ్యర్ వయసు 27 ఏళ్లు.
భారత జట్టు (Indian team) కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు.
2021లో న్యూజిలాండ్ తో టెస్టు లో అరంగేట్రం చేశాడు. 2017 డిసెంబర్ 10న శ్రీలంకతో వన్డే మ్యాచ్ ,
నవంబర్ 1న ఇదే ఏడాది న్యూజిలాండ్ తో టీ20 ఆడాడు శ్రేయాస్ అయ్యర్.
2015 నుంచి 2021 దాకా ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో ఐసీసీ నిర్వహించిన అండర్ -19 వరల్డ్ కప్ లో భారత్ తరపున ఆడాడు అయ్యర్. ముంబైలో పుట్టినా తన పూర్వీకులు కేరళకు చెందిన వారని ఆ మధ్యన చెప్పాడు.
అయ్యర్ లోని ఆటను మొదటగా గుర్తించింది భారత జట్టు (Indian team) మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే. అయ్యర్ కు శిక్షణ ఇచ్చాడు. అతడి ఆట తీరును చూసి అచ్చం వీరేంద్ర సెహ్వాగ్ లా ఆడతాడని కితాబు ఇచ్చారు క్రికెట్ విశ్లేషకులు.
2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 2.6 కోట్లకు తీసుకుంది. 2018లో అదే జట్టు రీటైన్ చేసుకుంది. గంభీర్ తప్పు కోవడంతో శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా ప్రకటించింది యాజమాన్యం.
తాజాగా ఐపీఎల్ వేలంలో రూ. 12.25 కోట్లకు అమ్ముడు పోయాడు. జిల్లెట్, బోట్, ఫ్రెస్కా జ్యూసెస్ , మైప్రొటిన్ , గూగుల్ పిక్సెస్ , మన్యావర్, డ్రీమ్ 11, సియట్ వంటి పేరొందిన బ్రాండ్లకు పని చేస్తున్నాడు. నికర సంపాదన రూ. 53 కోట్లుగా ఉంటుందని ఇండియా ఫాంటసీ పేర్కొంది.
Also Read : సీఎస్కేకు బిగ్ షాక్ ధోనీ గుడ్ బై