Kane Williamson : మామూలోడు కాదు మ‌న‌సున్నోడు

ప్ర‌పంచ క్రికెట్ లో కేన్ వెరీ స్పెష‌ల్

Kane Williamson : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ (IPL in Mumbai) 15వ సీజ‌న్ 2022 రిచ్ లీగ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కేన్ విలియ‌మ్స‌న్ (Kane Williamson)గురించి ఎంత చెప్పినా త‌క్కువే (Sunrisers Hyderabad).

ప్ర‌పంచ క్రికెట్ లో ఆట‌గాడిగానే కాదు మాన‌వ‌త్వం క‌లిగిన వ్య‌క్తి. గుప్త దానాలు చేయ‌డంలో అత‌డికి అత‌డే సాటి. ఈ (New Zealand cricketer) న్యూజిలాండ్ క్రికెట‌ర్ మోస్ట్ పాపుల‌ర్ వ‌ర్ధ‌మాన క్రికెట్ ప్ర‌పంచంలో.

మిస్ట‌ర్ కూల్..కామ్ అన్న ప‌దాల‌కు అర్థం తెలుసు కోవాలంటే ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌ని లేదు విలియ‌మ్స‌న్ ను చూస్తే చాలు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఉండే అరుదైన క్రికెట‌ర్ల‌లో కేన్ ఒక‌రు.

1990 ఆగ‌స్టు 8న న్యూజిలాండ్ లోని టౌరంగ‌లో పుట్టాడు. ఇప్పుడు ఆయ‌న‌కు 31 ఏళ్లు. రైట్ హ్యాండ్ బ్యాట‌ర్. 2010లో క్రికెట్ లో త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు. అదే ఏడాది న‌వంబ‌ర్ 4న భార‌త్ తో టెస్టు మ్యాచ్ ఆడాడు.

ఆగ‌స్టు 10న వ‌న్డే మ్యాచ్ ను , 2011 జింబాబ్వేతో టీ20 స్టార్ట్ చేశాడు. 2011 నుంచి 2012 దాకా గ్లౌసెస్ట‌ర్ షైర్ కు, 2013 నుంచి 2018 వ‌ర‌కు యార్క్ షైర్ కు ఆడాడు. 2-15 నుంచి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

ప్ర‌పంచం లోనే నంబ‌ర్ వ‌న్ టెస్ట్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఐసీసీ ద‌శాబ్ద‌పు క్రికెట‌ర్ గా గారీ ఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. 2021 న‌వంబ‌ర్ లో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో న్యూజిలాండ్ ను ఫైనల్ కు తీసుకు వ‌చ్చాడు.

2022లో జరిగిన వేలం పాట‌లో ఎస్ఆర్ హెచ్ రూ. 14 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. ప‌వ‌రేడ్, రాకిట్, ఏసిక్స్ , సీగ్రామ్ రాయ‌ల్ స్టాగ్ వంటి బ్రాండ్ల‌కు ఎండార్స్ చేశాడు. ఏడాదికి రూ. 58 కోట్ల ఆస్తి క‌లిగి ఉన్నాడ‌ని అంచ‌నా.

Also Read : ఐపీఎల్ ఫ్యాన్స్ కు తీపిక‌బురు

Leave A Reply

Your Email Id will not be published!