Rohit Sharma : రోహిత్ శర్మకు హిట్ మ్యాన్ గా పేరుంది. ఐపీఎల్ లో (Mumbai Indians) జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం (Indian Cricket team) భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్ లకు స్కిప్పర్ (IPL). కోట్లల్లో ఆదాయం. ఎక్కడా హంగు ఆర్భాటం లేకుండా సాగిపోయే మనస్తత్వం మనోడిది.
ఒకరకంగా చెప్పాలంటే మిస్టర్ కూల్. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కు ఆ పేరుంది. అయితే ఇక్కడ సంజూ శాంసన్ ను కూడా పేర్కొనాల్సి ఉంటుంది.
ఆగ్రహానికి గురి కావడం అంటూ జరగదు. ఏదో ప్రత్యేక పరిస్థితులు ఎదురైతే తప్పా. కెరీర్ పరంగా టన్నుల కొద్దీ పరుగులు సాధించడంలో దిట్టగా పేరుంది రోహిత్ శర్మకు. ప్రత్యేకించి సిక్సర్లు బాదడంలో వెరీ స్పెషల్.
మూడు ఫార్మాట్ లలో టాప్ క్రికెటర్లలో ఒకడిగా పేరుంది. తన సారథ్యంలోనే (Mumbai Indians) కు టైటిళ్లు తీసుకు వచ్చాడు. ఇందుకు ఇంకొకరిని కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది.
శ్రీలంక క్రికెట్ మాజీ దిగ్గజం మహేళ జయవర్దనే. పూర్తిగా ప్రశాంతంతతో ఉండే మహేళ కోచ్ గా ఉండడం కూడా ఆ జట్టుకు అదనపు బలం అని చెప్పక తప్పదు. ముంబై వేదికగా ఐపీఎల్ సంబురం ప్రారంభమైంది.
(Mumbai Indians) కు రోహిత్ శర్మ (Rohit Sharma)అదనపు బలం కూడా. ఐపీఎల్ లో భాగంగా 2008లో దెక్కన్ ఛార్జర్స్ కు ఎంపికయ్యాడు. ఆ జట్టు ఐపీఎల్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
2011లో ముంబై ఇండియన్స్ (Rohit Sharma)తీసుకుంది. స్కిప్పర్ గా అత్యంత విజయవంతమైన నాయకుడిగా ఉన్నాడు. 2013, 2015, 2017, 2019, 2020 ట్రోఫీలను గెల్చుకోవడంలో రికార్డు సృష్టించాడు.
పలు బ్రాండ్లకు పని చేస్తున్న రోహిత్ శర్మ రూ. 187 కోట్లకు పైగానే ఉన్నట్లు అంచనా.
Also Read : మామూలోడు కాదు మనసున్నోడు