Faf Du Plessis : ప్ర‌త్య‌ర్థుల‌కు సింహ స్వ‌ప్నం

డుప్లెసిస్ దమ్మున్న క్రికెట‌ర్

Faf Du Plessis : మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే ఐపీఎల్ అత‌డే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Bangalore) కు చెందిన కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(Faf Du Plessis). 37 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన డుప్లెసిస్ ఏ ఫార్మాట్ లోనైనా ఆడే స‌త్తా క‌లిగిన క్రికెట‌ర్.

1984 జూలై 13న ద‌క్షిణాఫ్రికా లోని ప్రిటోరియాలో పుట్టాడు. కుడి చేతి బ్యాట‌ర్ . బంతుల్ని అవ‌లీల‌గా బౌండ‌రీ లైన్ ను దాటించ‌గ‌ల‌గిన స‌మ‌ర్థుడు. అందుకే ఆర్సీబీ యాజ‌మాన్యం ఏరికోరి సార‌థిగా ఎంపిక చేసింది.

కొన్నేళ్ల పాటు ఆ జ‌ట్టుకు భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ నాయ‌కత్వం వ‌హించాడు. ఇటీవ‌లే అన్ని ఫార్మాట్ ల నుంచి త‌ప్పుకున్నాడు. 2011లో క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చాడు.

2012 న‌వంబ‌ర్ 23న టెస్టు స్టార్ట్ చేశాడు. చివ‌రి టెస్టు పాకిస్తాన్ తో ఆడాడు. 2011 జ‌న‌వ‌రి 18న ఇండియాతో వ‌న్డే మ్యాచ్ ఆడాడు. టీ20 ని 2012 లో ఇంగ్లండ్ తో ప్రారంభించాడు.

2008 నుంచి 2009 దాకా లాంక్ షైర్ కు ఆడాడు. 2005-2006, 2019, 2020 టైటాన్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2012 నుంఇ 2015 దాకా చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఆడాడు.

2016 నుంచి 2017 దాకా పూణే సూప‌ర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు డుప్లెసిస్(Faf Du Plessis). 2018 నుంచి 2021 దాకా సీఎస్కే త‌ర‌పున ఆడాడు. 2022లో (Royal Challengers Bangalore) భారీ ధ‌ర‌కు ఓన్ చేసుకుంది.

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు మాజీ కెప్టెన్. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ఫీల్డ‌ర్ల‌లో ఒక‌డు. ఐపీఎల్ లో మూడో సంప‌న్న క్రికెట‌ర్ గా పేరొందాడు. రూ (cricketer in IPL). 102గా అత‌డి సంపాద‌న ఉంద‌ని అంచ‌నా. (IPL) ఈసారి ఐపీఎల్ లో జ‌ట్టుకు టైటిల్ తీసుకు వ‌స్తాడో లేదో వేచి చూడాలి.

Also Read : మామూలోడు కాదు మ‌న‌సున్నోడు

Leave A Reply

Your Email Id will not be published!