Hardik Pandya : ప‌వ‌ర్ ఉన్నోడు హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ లో ఊహించ‌ని ఛాన్స్

Hardik Pandya : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ 2022 (IPL 2022) లో ఊహించ‌ని రీతిలో అదృష్టం క‌లిగిన ఏకైక ప్లేయ‌ర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya). ఈసారి జ‌రిగే ఐపీఎల్ (IPL) లో కొత్త‌గా ఏర్పాట‌య్యే గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) కు ఏకంగా కెప్టెన్ గా ఎంపిక‌య్యాడు.

ఇది యావ‌త్ క్రికెట్ వ‌ర్గాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది. గుజరాత్ లోని సూర‌త్ లో 1993 అక్టోబ‌ర్ 11న పుట్టాడు.

ఇప్పుడు హార్దిక్ పాండ్యా వ‌య‌సు 28 ఏళ్లు. భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు.

రైట్ హ్యాండ్ బ్యాట‌ర్. ఎలాంటి బంతులైనా అవ‌లీల‌గా ఎదుర్కొనే స‌త్తా ఉన్న క్రికెట‌ర్.

మ‌రో క్రికెట‌ర్ కృనాల్ పాండ్యా కు సోద‌రుడు హార్దిక్ పాండ్యా. టీ20లో ఆస్ట్రేలియాతో 2016 జ‌న‌వ‌రి 26న అరంగేట్రం చేశాడు.

2012-2013 బ‌రోడా క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2015 నుంచి 2021 దాకా ముంబై ఇండియ‌న్స్ కు ఆడాడు. ఆ ఏడాది స‌రైన ప‌ర్ ఫార్మెన్స్ వ‌హించ లేదు.

2015లో ముంబై ఇండియ‌న్స్ రూ. 10 ల‌క్ష‌లు తీసుకుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో

12 బంతుల‌లో 30 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కేవ‌లం 8 బాల్స్ ఆడి 21 ప‌రుగులు చేశాడు.

మ్యాచ్ గెలిపించాడు. స‌త్తా చాటాడు. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Night Riders) తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 30 బంతులు ఆడి 61 ర‌న్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందాడు. బ్యాట‌రే కాదు బౌల‌ర్ కూడా. ఆల్ రౌండ‌ర్ గా పేరొందాడు.

ఆసియా క‌ప్ , ప్ర‌పంచ క‌ప్ టీ20ల‌లో పాండ్యా అద్భుతంగా ఆడాడు. దీంతో ముంబై ఇండియ‌న్స్ భారీ వేత‌నం పెంచింది. అన్ని ఫార్మాట్ లలో కీల‌క ఆట‌గాడిగా మారాడు.

పాకిస్తాన్ తో 2017లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కు వ‌ణుకు పుట్టించాడు. ఆసిస్ తో మ్యాన్ ఆఫ్ ద సీరీస్ గా ఎంపిక‌య్యాడు. 2018లో ఐపీఎల్ (IPL) కోసం రూ. 12 కోట్లు పెట్టి తీసుకుంది.

2019లో విధ్వంస‌క‌ర‌మైన బ్యాట‌ర్ గా పేరొందాడు. గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans)  భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసి కెప్టెన్ గా ఎంపిక చేసింది. నిక‌ర సంపాద‌న రూ. 37 కోట్లు సంపాదిస్తున్న‌ట్లు అంచ‌నా.

Also Read : అయ్య‌ర్ అయ్యారే ఆట భ‌ళారే

Leave A Reply

Your Email Id will not be published!