IPL BCCI : ప్రపంచ క్రికెట్ లోనే కాదు క్రీడా పరంగా చూస్తే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థల్లో భారత దేశానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు – బీసీసీఐ (BCCI) ఒకటిగా నిలిచింది. వచ్చే ఏడాది నాటికి ఏకంగా బీసీసీఐ(IPL BCCI )ఆదాయం రూ. 50 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
అంటే దేశంలోని ఓ రాష్ట్రానికి సరిపడా బడ్జెట్ అన్నమాట. ఇది పైకి కనిపించే అంకెలు మాత్రమే. గణనీయమైన ఆదాయం వస్తోంది బీసీసీఐకి.
అందుకే ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా(Amit Chandra Shah) ఏరికోరి తన తనయుడు జే షాను బీసీసీఐలోకి ఎంటర్ అయ్యేలా చక్రం తిప్పాడు.
ఆ విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్ లు, నిర్వహణ, వేలం పాటలు, ప్రసార హక్కులు..ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు చాలవు. అన్నీ కోట్లే. బీసీసీఐ (BCCI) గత ఏడాది ఐపీఎల్ కు సంబంధించి కొత్త జట్ల కోసం వేలం పాట నిర్వహిస్తే ప్రపంచ వ్యాప్తంగా బడా కంపెనీలు ఎంటర్ అయ్యాయి.
చివరకు రెండు కంపెనీలు చేజిక్కించుకున్నాయి. ఆ రెండింటి వల్ల బీసీసీఐకి ఏకంగా రూ. 1725 కోట్లు సమకూరాయి. ఇదంతా ఆదాయమే. ఇక ఐపీఎల్(IPL BCCI )కు సంబంధించి ఈసారి భారీ ఎత్తున ఆదాయం సమకూరింది బీసీసీఐకి.
స్పాన్సర్ షిప్ గా ఉన్న వివో తప్పుకుంది. దీనికి బదులు టాటా కంపెనీ (Tata Company) దక్కించుకుంది. ఇక్కడ కూడా సంస్థకు ఆదాయం సమకూరుతోంది. మొత్తం మీద ఆటగాళ్లే పెట్టుబడిగా ఆడుతున్న నాటకంలో బీసీసీఐ (BCCI) మాత్రం రారాజుగా వెలుగొందుతోంది.
Also Read : సూర్య కుమార్ పై సన్నీ కామెంట్స్