Ricky Ponting Pant : ఆసిస్ క్రికెట్ మాజీ దిగ్గజ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటిల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు భవిష్యత్తులో కాబోయే కెప్టెన్ మాత్రం కచ్చితంగా రిషబ్ పంత్ అని పేర్కొన్నాడు.
తన కెరీర్ లో 24 ఏళ్లే అయినప్పటికీ ఎన్నో హెచ్చు తగ్గులు చూశాడని అన్నాడు. స్టార్టింగ్ నుంచి ఆటపై ఫోకస్ పెడుతూ వచ్చాడు. ఒకానొక సమయంలో భారత జట్టు మాజీ కెప్టెన్ ధోనీని మరిపించేలా చేశాడని అన్నాడు రికీ పాంటింగ్(Ricky Ponting Pant).
రోహిత్ శర్మ తర్వాత రిషబ్ పంత్ వైపు భారత సెలెక్షన్ కమిటీ చూడక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రధానంగా పంత్ ఆడుతుంటే ఆస్ట్రేలియా జట్టుకు చెందిన గ్రేట్ ప్లేయర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ను గుర్తుకు తెస్తుందన్నాడు.
మరో వైపు రోహిత్ శర్మకు దగ్గరి పోలికలు పంత్ లో ఉన్నాయని చెప్పాడు. ఐపీఎల్ రిచ్ లీగ్ సందర్భంగా రికీ పాంటింగ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
2013 లో ముంబై ఇండియన్స్ లోకి ఎంటర్ అయినప్పుడు రోహిత్ శర్మ కూడా ఇలాగే ఉన్నాడని ఆ తర్వాత ఆ జట్టును విజయ పథంలోకి నడిపించాడని తెలిపాడు రికీ పాంటింగ్ .
ప్రస్తుతం ఐపీఎల్ లో ఆ జట్టు సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచేలా చేశాడని కితాబు ఇచ్చాడు. సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. పృథ్వీ షా కూడా ఇలాంటి దూకుడు ఆట ఆడాడని కితాబు ఇచ్చాడు.
Also Read : ఉమెన్ ఐపిఎల్కి సిద్దమవుతున్న బిసిసిఐ