PV Sindhu : తెలుగు వారి అమ్మాయి పీవీ సింధు మరో ఘనతను సాధించింది. థాయ్ లాండ్ కు చెందిన బుసానన్ ఒంగ బమ్రుంగ్ ఫాన్ ను ఓడించి ప్రతిష్టాత్మకమైన స్విస్ ఓపెన్ టైటిల్- 2022 ను గెలుచుకుంది.
ఆదివారం జరిగిన ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సమ్మిట్ క్లాష్ లో థాయ్ లాండ్ కు చెందిన బుసానన్ పై ఏస్ ఇండియన్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) వరుస గేమ్ లతో విజయం సాధించింది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది పీవీ సింధుకు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. టోర్నమెంట్ లో డబుల్ ఒలింపిక్ విజేత అయిన సింధు బాసెల్ లోని సెయింట్ జాకోబ్ షాల్ లో 21-16, 21-8 తో నాలుగో సీడ్ థాయ్ పై గెలుపొందింది.
ఆమెపై విజయం సాధించేందుకు 49 నిమిషాల సమయం పట్టింది. కాగా 2019లో హాంకాంగ్ ఓపెన్ లో థాయ్ తో ఒక్కసారి మాత్రమే ఓడి పోయింది. 17 సార్లు పీవీ సింధు ఆమె తలపడితే 16 సార్లు గెలుపొందడం విశేషం.
అయితే రియో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ తో గత ఎడిషన్ ఫైనల్లో పీవీ సింధు ఓడి పోయింది. ఏపీకి చెందిన 26 ఏళ్ల పీవీ సింధు ఇప్పటికే పేరు తెచ్చుకుంది.
ఇక ఈ ఏడాది జనవరిలో లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 3033 లో పీవీ సింధు విజేతగా నిలిచింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే పీవీ సింధు గెలుపొందడం తో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read : దేశం గర్వ పడేలా ఆడారు