Mithali Raj : న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ -2022 లో సెమీ ఫైనల్ కోసం జరిగిన మ్యాచ్ టోర్నీకి హైలెట్ గా నిలిచింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఇండియా, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య మ్యాచ్.
ఇదిలా ఉండగా చివరి బంతి వరకు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. ఆఖరు బంతికి ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. మిథాలీ సేన కు కోలుకోలేని షాక్ తగిలింది.
విచిత్రం ఏమిటంటే ఫైనల్ ఓవర్ లో నో బాల్ ఇవ్వడమే భారత మహిళా జట్టును కొంప ముంచింది. దీంతో టోర్నీ నుంచి ఇండియా నిష్క్రమించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన డ్రామాటిక్ ఫైనల్ ఓవర్ లో నో బాల్ గురించి కీలక కామెంట్స్ చేసింది కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj).
దీంతో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఒక దశలో ఆట చివరి వరకు మ్యాచ్ ఇండియా వైపు ఉంది. కానీ ఒకే ఒక్క నో బాల్ నిర్ణయం భారత్ ను కొంప ముంచింది.
ఆఖరి ఓవర్ లో క్రీజులో మిగ్నాన్ డు ప్రీజ్ , షబ్నిమ్ ఇస్మాయిల్ లతో దక్షిణాఫ్రికాకు 7 పరుగులు అవసరం అయ్యాయి. చివరకు రెండు బంతుల్లో మూడు రన్స్ కావాల్సి వచ్చింది.
చివరి డెలివరీలో డు ప్రీజ్ ను దీప్తి అవుట్ చేసింది. కాగా రిప్లేలో దీప్తి అతిక్రమించినట్లు చూపించింది. దీప్తి బ్యాటర్ గా, బౌలర్ గా ఉన్నప్పటికీ ఆమె గత కొన్ని ఆడలేదు.
కానీ ఇవాళ దీప్తి చేసిన బౌలింగ్ విధానం అద్భుతమైని కొనియాడింది మిథాలీరాజ్. ఝులన్ గోస్వామి లేక పోవడం పెద్ద దెబ్బ అని పేర్కొంది.
Also Read : మెరిసిన మిథాలీ రాణించిన మంధాన