PBK vs RCB ipl 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై లోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ (PBK vs RCB)స్కోర్ చేసింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 205 పరుగులు చేసింది.
కోహ్లీ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన డుప్లెసిస్ దుమ్ము రేపాడు. డుప్లెసిస్ 88 పరుగులు చేస్తే కోహ్లీ 50 పరుగులు జోడించారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 118 పరుగులు చేశారు
. విచిత్రం ఏమిటంటే డుప్లెసిస్ సెంచరీ చేయలేక పోయాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేక పోయారు. రాహుల్ చాహర్ , ఆర్ష్ దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
అంతకు ముందు పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉండగా రెండు జట్లకు ఇద్దరూ కొత్తగా కెప్టెన్ లుగా ఎంపికయ్యారు. పంజాబ్ కింగ్స్ కు మయాంక్ అగర్వాల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
కేఎల్ రాహుల్ తప్పు కోవడంతో ఈసారి మయాంక్ కు ఛాన్స్ దొరికింది. ఇక డుప్లెసిస్ 57 బంతులు ఆడి 3 ఫోర్లు 7 సిక్సర్లు కొట్టాడు. 30 బంతులు ఆడి 17 రన్స్ మాత్రమే చేసిన ఆర్సీబీ కెప్టెన్ చివర 27 బంతుల్లో నే మిగతా 71 పరుగులు చేశాడు.
ఇదిలా ఉండగా అరుదైన ఘనతను స్వంతం చేసుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 3 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతి తక్కువ ఇన్సింగ్స్ లో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్ కావడం విశేషం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఎదురీదుతోంది.
Also Read : వెల్ డన్ బాయ్స్ – మెకల్లమ్