ONGC : మోదీ (Modi) ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను గంప గుత్తగా అమ్మకానికి పెట్టింది. ఇప్పటికే బ్యాంకులపై కన్నేసింది. ఇక ఆదాయంలో ఉన్న జీవిత బీమా సంస్థను అమ్మాలని అనుకుంటోంది. తాజాగా ఆయిల్ (Oil) , గ్యాస్ (Gas) కంపెనీలపై ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వ రంగ చమురు (Oil) , గ్యాస్ (Gas) ఉత్పత్తిలో టాప్ లో ఉన్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ – ఓఎన్జీసీలో (ONGC) రూ. 15 శాతం వాటాలు విక్రయించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించ వద్దంటూ దేశ వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాట పట్టారు. వాటాల విక్రయం ద్వారా రూ. 3,000 వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది.
ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ కోసం ఫ్లోర్ ధరను షేరు ఒక్కింటికి రూ. 159 గా నిర్ణయించినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా కంపెనీలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్ఎస్ కింద 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్ , బీమా కంపెనీలకు 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు.
అయితే ఓఎన్జీసీ (ONGC) లో పని చేస్తున్న ఉద్యోగులు తలో రూ. 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. 0.075 శాతం షేర్లను అర్హులైన ఎంప్లాయిస్ కు కటాఫ్ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. ఇలా అమ్ముకుంటూ పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. ఓఎన్జీసీ (ONGC) అమ్మకాన్ని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
Also Read : ఫెడెక్స్ సిఇఓగా రాజ్ సుబ్రమణ్యం