RCB vs KKR IPL 2022 : ఐపీఎల్ (IPL) 2022 రిచ్ లీగ్ లో ఆసక్తికరమైన పోరులో ఎట్టకేలకు బోణీ కొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) . బౌలింగ్ లో సత్తా చాటింది. ప్రత్యర్థి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది.
ప్రధానంగా ఆర్సీబీ (RCB) బౌలర్ హసరంగ తన బౌలింగ్ కు పదును పెట్టాడు. కేకేఆర్ (KKR) బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇక హర్షల్ పటేల్ సైతం సత్తా చాటడంతో 129 పరుగులకే చాప చుట్టేసింది కేకేఆర్.
ఐపీఎల్ (IPL) ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది కేకేఆర్ (KKR) . రెండో మ్యాచ్ లో ఓటమి మూటగట్టుకుంది.
లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఆర్సీబీ (RCB) సైతం నానా తంటాలు పడింది గెలిచేందుకు ఆ జట్టు ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది ఈ టార్గెట్ ను చేరేందుకు. టాస్ గెలిచిన ఆర్సీబీ (RCB) ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇక బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ (KKR) 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. రసెల్ ఒక్కడే 18 బంతులు ఆడి 25 పరుగులు చేశాడు. ఇందుల ఓ ఫోర 3 సిక్స్ లు ఉన్నాయి.
ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇక శ్రీలంక ఆటగాడు హసరంగ కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం బరిలోకి దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది. రూథర్ ఫోర్డ్ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇరు జట్లు త్వర త్వరగా వికెట్లు కోల్పోయాయి.
Also Read : హసరంగ మెస్మరైజ్ బౌలింగ్ సూపర్