Ugadi Festival 2022 : తెలుగు వాకిట‌ సంబురం ఉగాది ప‌ర్వ‌దినం

య‌శ‌స్సునే కాదు ఉశ‌స్సును పంచే పండుగ

Ugadi Festival 2022 : తెలుగు వారంద‌రికీ ప్రీతి పాత్ర‌మైన పండుగ ఉగాది. తెలుగు వారితో పాటు ఇత‌రులు కూడా ఈ ప‌ర్వ‌దినాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ప్ర‌తి ఏటా ఛైత్ర శుద్ధ పాడ్య‌మి రోజు ఉగాది పండుగ వ‌స్తుంది.

ఉగ‌స్య ఆది అనేదే ఉగాది(Ugadi Festival 2022). ఉగ అంటే న‌క్ష‌త్ర గ‌మ‌నం. జ‌న్మ ఆయుష్షు అని అర్థం. ఉగాదికి మ‌రో పేరు యుగాది.

పాడి పంట‌ల‌కు సంక్రాంతి అయితే కొత్త వ‌సంతం చిగురించే స‌మ‌యం ఈ పండుగ‌. ష‌డ్రుచుల స‌మ్మేళనం ఇది.

భార‌తీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్య‌మి రోజు సృష్టి జ‌రిగింద‌ని పురాణాల‌లో పేర్కొన్నారు.

వ‌సంతాల‌కు ఈ పండుగ‌కు అవినాభావ సంబంధం ఉంది. ఒక ర‌కంగా విడ‌దీయ లేని అనుబంధం.

ఉగాది (Ugadi Festival 2022)అంటేనే ప‌చ్చ‌డికి ప్ర‌త్యేకం.

ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా చెప్పిన‌ప్ప‌టికీ జ‌డ‌ప్రాయంగా ఉన్న ఈ స‌క‌ల జ‌గ‌త్తులో చైత‌న్యాన్ని నెల‌కొల్పి మాన‌వాళిలో

కొంగొత్త ఆశ‌యాల‌కు అంకురార్ప‌ణ చేసే శుభ దిన‌మే ఉగాది ప‌ర్వ‌దినం. శిశిర రుతువు ఆకురాలు కాలం. శిశిరం త‌ర్వాత వ‌సంతం వ‌స్తుంది.

చెట్లు చిగురిస్తాయి. వీటి కార‌ణంగా ప్ర‌కృతి శోభాయ‌మానంగా ఉంటుంది. కోయిల‌లు,

ప‌క్షులు కిల కిలా రావాలు వినిపిస్తాయి. ఇక ఉగాది పండుగ రోజు నుంచే కొత్త సంవ‌త్స‌రం మొద‌ల‌వుతుంది.

దీంతో తెలుగు వారంద‌రికీ ఇదే తొలి పండుగ‌. ఇక తెలుగు వారంద‌రూ ద‌శాబ్దాలుగా, యుగాల నుంచి కొత్త ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. పర్వ‌దినం రోజు ప్రారంభిస్తే అంతా శుభం క‌లుగుతుంద‌ని న‌మ్మ‌కం. ప్రాతః కాలం లేస్తారు.

ఇళ్లు, వాకిళ్లు శుభ్రం చేస్తారు. గుమ్మాల‌న్నీ ప‌చ్చ‌ని తోర‌ణాలతో అల‌రారుతాయి.

కొత్త దుస్తులు ధ‌రిస్తారు. ఉగాది ప‌చ్చడితో దిన‌చ‌ర్య ప్రారంభిస్తారు. ఉగాది ప‌చ్చ‌డి ఈ పండుగ‌కు ప్ర‌త్యేక‌మైన‌ది. ప్ర‌శ‌స్త‌మైన‌ది.

ష‌డ్రుచుల స‌మ్మేళం అంటే ఇందులో తీపి – మ‌ధురం, పులుపు – ఆమ్లం ..ఉప్పు – ల‌వ‌ణం – కారం – క‌టు – చేదు – తిక్త – వ‌గ‌రు – క‌షాయం అనే ఆరు రుచులు క‌లిపి చేస్తారు దీనిని.

ఏడాది పొడ‌వునా ఎదుర‌య్యే మంచి, చెడులు, క‌ష్ట సుఖాలు సంయ‌మ‌నంతో స్వీక‌రించాల‌న్న సందేశ‌మే ఈ ఉగాది ప‌చ్చ‌డి తెలియ చేస్తుంది.

వీటితో పాటు అర‌టి ప‌ళ్లు, మామిడి కాయ‌లు, వేప పువ్వు, చింత పండు, జామ కాయ‌లు, బెల్లం వాడ‌తారు.

Also Read : జ‌నంపై మోత‌మోగిస్తున్న జ‌గ‌న్‌

Leave A Reply

Your Email Id will not be published!