PBKS vs KKR IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (PBKS vs KKR IPL 2022కు ఊహించ లేని షాక్ తగిలింది. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
కేకేఆర్ బౌలర్ల దెబ్బకు పంజాబ్ ఠారెత్తింది. కేవలం 18.2 ఓవర్లలోనే చాప చుట్టేసింది. 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో బరిలోకి దిగిన కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘన విజయోన్ని నమోదు చేసింది.
ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్న రసెల్ 2 ఫోర్లు 8 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు.
దీంతో పంజాబ్ బౌలర్లు నేల చూపులు చూశారు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 14.3 ఓవర్లలోనే టార్గెట్ ముగించింది. లక్ష్యం చిన్నదే
అయినప్పటికీ 51 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నట్లు అనిపించిన సమయంలో ఆండ్రీ రసెల్ క్రీజులోకి వచ్చాడు.
వచ్చీ రావడం తోనే బాదడం మొదలు పెట్టాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. ప్రతి బంతిని బాదడమే పనిగా మొదలు పెట్టాడు. దీంతో గెలుపు ఖాయమై పోయింది.
పంజాబ్ ఆటగాళ్లు మైదానంలో చేష్టలుడిగి పోయారు. రసెల్ కు తోడుగా సామ్ బిల్లింగ్ నిలిచాడు. 24 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో చహర్ 2 వికెట్లు , రబాడా , స్మిత్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు పంజాబ్ ప్రతిఘటన లేకుండానే తక్కువ స్కోర్ కే పరిమితమైంది.
Also Read : దిగ్గజాల కలయికతో ఫ్యాన్స్ ఖుషీ