Arvind Kejriwal : గుజరాత్ టూర్ లో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన నినాదాన్ని అందుకున్నారు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. లేదంటే తమ ఆప్ ను దించేయండి అంటూ ప్రకటించారు.
పనిలో పనిగా ఆయన గుజరాత్ లో గత 25 ఏళ్లుగా పవర్ లో ఉన్నా అవినీతి, అక్రమాలను నియంత్రించ లేక పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆప్ చీఫ్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఉన్నారు.
అంతకు ముందు మహాత్ముడి శబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అహ్మదాబాద్ లో నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు.
అనంతరం ఇవాళ నగరంలో పేరొందిన స్వామి నారాయణ ఆలయంలో అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal) , భగవంత్ మాన్ ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని ఆప్ డిసైడ్ అయ్యింది.
ఇప్పటికే ఢిల్లీతో పాటు ఇటీవల పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో 92 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్షాలను విస్తు పోయేలా చేసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక ప్రసంగం చేశారు. ఢిల్లీ మోడల్ గుజరాత్ లో అమలు చేస్తామని ప్రకటించారు.
అయితే అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లను ఉద్దేశించి గుజరాత్ బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరి వల్ల ఏమీ కాదని వారంతా పర్యాటకులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా స్వామి నారాయణ్ ఆలయంలో పూజలు చేశారు.
Also Read : ఒక్క ఛాన్స్ ఇవ్వండి లేక పోతే మార్చండి