Australia Celebrations : విజ‌యం అద్భుతం ఆసిస్ సంబురం

ఆసిస్ సిగ‌లో ఏడోసారి వ‌ర‌ల్డ్ క‌ప్

Australia Celebrations : ప్ర‌పంచ మ‌హిళా క్రికెట్ చ‌రిత్ర‌లో అరుదైన చరిత్ర‌ను సృష్టించింది ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట్ జ‌ట్టు. న్యూజిలాండ్ వేదిక‌గా ఐసీసీ మ‌హిళా వ‌న్డే ప్ర‌పంచ క్రికెట్ క‌ప్ ను ఇంగ్లండ్ ను ఓడించి చేజిక్కించుకుంది.

ఆసిస్ జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇది వ‌రుస‌గా ఆ జ‌ట్టు క‌ప్ గెల‌వ‌డం ఇది ఏడోసారి కావ‌డం విశేషం. దీంతో ఆస్ట్రేలియాతో పాటు యావ‌త్ క్రికెట్ లోకం సంబురాల‌లో (Australia Celebrations)మునిగి పోయింది.

ఇంగ్లండ్ పై ఘ‌న విజ‌యాన్ని సాధించి క‌ప్ ను చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా జ‌ట్టుపై అభిమానులు పెద్ద ఎత్తున ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు. ప్ర‌ధానంగా ఆ జ‌ట్టు స‌మిష్టి విజ‌యంతో ఆక‌ట్టుకుంది.

ఆసిస్ టీంలో అలిస్సా హీలీ అద్భుత‌మైన సెంచ‌రీ సాధించింది. ఏకంగా 170 ప‌రుగులు చేసింది. ఆసిస్ ఇంగ్లండ్ పై 71 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకంగా ఆ జ‌ట్టు భారీ స్కోరు చేసింది.

356 ప‌రుగులు చేసింది. వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లు 12 సార్లు జ‌రిగితే ఏకంగా వ‌రుస‌గా 7 సార్లు టైటిల్స్ గెలుపొందింది ఆస్ట్రేలియా టీమ్.

ఇక సోష‌ల్ మీడియా వేదిక‌గా అద్బుత గెలుపును న‌మోదు చేసి చ‌రిత్ర సృష్టించిన ఆ జ‌ట్టుకు సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌ల వెల్లువ వెల్లి విరిస్తోంది. వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ గా హీలీ చ‌రిత్ర సృష్టించింది.

ఆమెను టోర్నీ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు పొందింది. మీరు సాధించిన ఈ విజ‌యం మ‌హిళా క్రీడాలోకానికి స్పూర్తి దాయ‌కంగా నిలిచింది

Also Read : పంజాబ్ ను గ‌ట్టెక్కించిన లివింగ్‌స్టోన్.

Leave A Reply

Your Email Id will not be published!