Sri Lanka Protest : శ్రీలంక సంక్షోభం పెల్లుబికిన ప్రజాగ్రహం
ఆందోళనల దెబ్బకు మంత్రివర్గం రాజీనామా
Sri Lanka Protest : శ్రీలంకలో హాహాకారాలు, ఆర్తనాదాలతో అట్టుడుకుతోంది. ఆందోళనలు, నిరసనలతో (Protest) దద్దరిల్లుతోంది. రోజు రోజుకు ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. దీంతో చేయి దాటి పోతుందని గ్రహించిన శ్రీలంక మంత్రివర్గం మూకుమ్మడిగా రాజీనామా చేసింది.
దేశాధ్యక్షుడు రాజపక్సకు (Rajpaksa) ప్రధాని (Prime Minister) మహింద రాజపక్స రాజీనామా చేశారు. ఈ మేరకు తన రిజైన్ లేఖను ప్రెసిడెంట్ కు సమర్పించారు. ఈ తరుణంలో తాజాగా కేబినెట్ కూడా గుడ్ బై చెప్పడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ప్రస్తుతం శ్రీలంక (Sri Lanka) దేశంలో ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం నెలకొంది. రోజుల కొద్దీ విద్యుత్ కోతలతో చీకట్లో పలు ప్రాంతాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ రాజపక్స్ (Rajpaksa) భవనంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు ప్రజలు. దీంతో పరిస్థితిని గమనించిన శ్రీలంక (Sri Lanka) సర్కార్ అదుపు తప్పిన ఆర్థిక సంక్షోభానికి (Sri Lanka Protest)తెర దించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయక పోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారంతా రోడ్లపైకి వచ్చారు. రాజపక్స కు చెందిన ఫ్యామిలీ అంతా ప్రభుత్వంలో ఉండడం చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా గోటబయ రాజపక్స్ , ఆయన తోబుట్టువు ప్రధాని మహింద రాజపక్సను పక్కన పెట్టి మొత్తం మంత్రివర్గం తమ పదవులకు రాజీనామా చేయడం కలకలం రేగింది.
1948 తర్వాత శ్రీలంక ఎన్నడూ లేని రీతిలో ఆర్థిక ఇబ్బందులతో అట్టుడుకుతోంది. పెరుగుతున్న అశాంతి నేపథ్యంలో శ్రీలంక చీఫ్ రాజపక్సే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
Also Read : మళ్లీ నోరు జారిన బైడెన్