Zelensky Grammy : సంగీతం యుద్ధపు నిశ్శబ్ధాన్ని ఛేదించాలి
గ్రామీని ఉద్దేశించి ప్రెసిడెంట్ జెలెన్ స్కీ
Zelensky : ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం 2022 సంవత్సరానికి సంబంధించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు ప్రెసిడెంట్.
పాడైన నగరాల నిశ్శబ్దం గురించి మాట్లాడాలని కళాకారులకు పిలుపునిచ్చారు. సంగీతానికి విరుద్దమైంది ఏమిటి..శిథిలమైన నగరాలు, చంపబడిన వ్యక్తుల నిశ్శబ్దమేనని ప్రకటించారు.
ప్రపంచంలోని ఉక్రెనియన్లంతా మీకు సాధ్యమయ్యే విధంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు జెలెన్ స్కీ(Zelensky). తన దేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
సినిమా రంగం అత్యంత బలీయమైన రంగం. ఈ రంగంలో అత్యంత ప్రతిభావంతులు, సృజనాత్మకతను కలిగి ఉంటారని ప్రశంసించారు.
ఈ ప్రపంచం మీ కోసం ఎదురు చూస్తోందన్నారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్.
అగ్రశ్రేణి కళాకారులను సంగీతంతో యుద్దం తెచ్చిన నిశ్శబ్దాన్ని పూరించండని కోరారు.
ఉక్రేనియన్ గాయకుడు మికా న్యూటన్ , సంగీతకారుడు సియుజన్నా ఇగ్లిడాన్,
కవి లియుబా యాకిమ్ చుక్ లతో కలిసి జాన్ లెజెండ్ ఫ్రీ ప్రదర్శనకు ముందు జెలెన్ స్కీ(Zelensky) సందేశం వినిపించారు.
సంగీతానికి విరుద్దమైనది ఏమిటి..?. శిథిలమైన నగరాలు, ప్రజలను చంపిన నిశ్శబ్దం అని పేర్కొన్నారు.
మా సంగీత విధ్వాంసులు టక్కేడోలకు బదులుగా శరీర కవచాన్ని ధరిస్తారు.
వారు ఆస్పత్రులలో గాయపడిన వారికి..విన లేని వారికి కూడా పాడతారు. కానీ సంగీతం ప్రపంచానికి చెందింది. ఇక్కడి కళాకారులు ప్రజల కోసం, దేశం కోసం పాడతారని స్పష్టం చేశాడు జెలెన్ స్కీ.
మా నేలపై బాంబులతో భయంకరమైన నిశ్శబ్దాన్ని తెచ్చే రష్యాతో నిరంతరం పోరాడుతున్నాం. చని పోయిన నిశ్శబ్దం, ఈ శూన్యాన్ని తీర్చేందుకు మీ సంగీతంతో నింపండి. మా కథను చెప్పేందుకు ఈ రోజు నింపండి అని జెలెన్ స్కీ విన్నవించారు.
మీ సామాజిక మాధ్యమాలలో , ప్రసార మాధ్యమాలలో యుద్ధం గురించి చెప్పండి. రష్యా చేస్తున్న దాడుల గురించి, మారణ హోమం గురించి ఈ ప్రపంచానికి మరింత తెలియ చేయాలని పిలుపునిచ్చారు.
కళాకారులు మీరంతా యుద్దం వద్దని శాంతి కావాలని నినదించండి అని కోరారు జెలెన్ స్కీ. తాము కొన్ని తరాల పాటు కాపాడుకుంటూ వస్తున్న నగరాలను ఈ యుద్దం నాశనం చేస్తోంది.
చెర్ని హివ్, ఖార్కివ్ , వోల్నో వాఖా, మారియా పోల్ ..తదితరుల పురాణ గాథలను వినిపించండి అన్నారు.
Also Read : లేపాక్షికి యునెస్కో శాశ్వత జాబితాలో చోటు దక్కేనా ?