Ross Taylor : న్యూజిలాండ్ కు చెందిన దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ ( Ross Taylor)ఆట నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ ల నుంచి తాను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశీయ సీజన్ ముగిశాక అంతర్జాతీయ క్రికెట్ ను వీడనున్నట్లు వెల్లడించాడు.
ఇవాళ రాస్ టేలర్ తన స్వస్థలమైన హామిల్టన్ లో నెదర్లాండ్స్ తో సీరీస్ లో నాల్గవ చివరి వన్డే నుంచి నిష్క్రమించాడు.
ఇదే తన కెరీర్ లో ఆఖరి మ్యాచ్ . క్రికెట్ పరంగా ఇది అద్భుతమైన ప్రయాణం.
నేను ఉన్నంత కాలం నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు.
ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా రాస్ టేలర్( Ross Taylor) ను ఉద్దేశించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
రాస్ టేలర్ అద్భుతమైన ఆటగాడు. ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరారు విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్.
ఆట సందర్భంగా ఎన్నో నేర్చుకున్నా. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో ఆడే ఛాన్స్ దక్కింది.
తాను ఆడినంత వరకు దేశం కోసమే ఆడానని పేర్కొన్నాడు రాస్ టేలర్. ఎంతో మందితో స్నేహం లభించిందని వాపోయాడు. క్రికెట్ పరంగా నాకు సంతోషమే కలిగిందన్నాడు.
ఇదిలా ఉండగా 2008లో దక్షిణాఫ్రికాపై తన టెస్ట్ అరంగేట్రం చేశాడు రాస్ టేలర్. 2006లో విండీస్ పై ఫస్ట్ వన్డే ఆడాడు. వన్డే క్రికెట్ లో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
19 సెంచరీలతో 7 వేల 548 రన్స్ చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న కేన్ విలియమ్సన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు రాస్ టేలర్. టేలర్ 102 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడాడు.
కీవీస్ తరపున మూడు ఫార్మాట్ లలో 100 కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఫస్ట్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. దేశంలోని గొప్ప ఆటగాళ్లలో రాస్ టేలర్ ఒకడు అని పేర్కొన్నాడు కోచ్ టేలర్.
Also Read : పంజాబ్ ను గట్టెక్కించిన లివింగ్‌స్టోన్