RP Singh CSK : గెలిస్తే బెట‌ర్ లేక పోతే క‌ష్టం

సీఎస్కే ప్లే ఆఫ్ పై ఆర్పీ సింగ్

RP Singh CSK : ముంబై వేదిక‌గా ప్రారంభ‌మైన ఐపీఎల్ 2002 రిచ్ 15వ లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్లుగా ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ తో పాటు ముంబై ఇండియ‌న్స్ పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు లీగ్ ప్రారంభ‌మైన నాటి నుంచి ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ సీఎస్కే (RP Singh CSK)ఓడి పోయింది. ఇక ముంబై ఇండియ‌న్స్ ది అదే ప‌రిస్థితి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఈ రెండు జ‌ట్ల‌ను మ‌ట్టి క‌రిపించింది.

ఆ జ‌ట్టు విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ఒక‌రు ఆడ‌క పోతే మ‌రొక‌రు దానిని పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ఈసారి ఐపీఎల్ వేలం పాట‌లో ఆ జ‌ట్టు డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు.

భారీ ఎత్తున డ‌బ్బులు పెట్టి హెట్మెయిర్ ను ఎంచుకుంది. ఆయ‌న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ఆడుతున్నాడు హెట్మెయిర్. ఇక బౌలింగ్ లో సైతం ఆ జ‌ట్టు స‌త్తా చాటుతోంది.

ఈ త‌రుణంలో సీఎస్కే పంజాబ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో కేవ‌లం 126 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది.

నిన్న‌టి దాకా జ‌ట్టును విజ‌య‌వంతంగా న‌డిపించిన ఎంఎస్ ధోనీ ఉన్న‌ట్టుండి మైదానంలో ఉన్న‌ప్ప‌టికీ ఆనాటి దూకుడును ప్ర‌ద‌ర్శించ లేక పోయాడు.

ఇక సీఎస్కే పూర్తిగా ప్ర‌మాదంలో ప‌డింది. ఇంకో మ్యాచ్ గనుక ఓడి పోతే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌డం క‌ష్టంగా ఉంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ పేస‌ర్ ఆర్పీ సింగ్(RP Singh CSK).

ఇక‌నైనా జ‌ట్టు సార‌థి ర‌వీంద్ర జ‌డేజా దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించాడు.

Also Read : విజ‌యం అద్భుతం ఆసిస్ సంబురం

Leave A Reply

Your Email Id will not be published!