KTR : అజీమ్ ప్రేమ్ జీ ఆద‌ర్శ ప్రాయుడు

ప్ర‌శంసించిన ఐటీ మంత్రి కేటీఆర్

KTR  : విప్రో చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్ జీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. జీవితం ప‌ట్ల స‌మాజం ప‌ట్ల ప్రేమ‌ను క‌లిగి ఉన్నారు. అంతే కాదు తాను సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం దాతృత్వ కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు చేశారు.

దీంతో దేశంలోనే సాయం అందించ‌డంలో టాప్ లో ఉన్నారు. సేవ‌, స‌హాయం ఈ రెండూ జీవితంలో ముఖ్య‌మైన‌వ‌ని అంటారు. ఒక్కో సంద‌ర్భంలో విలువ‌ల‌ను కోల్పోతే ఏమీ సాధించ‌లేమ‌ని పేర్కొంటారు.

ఎవ‌రైనా స‌రే ఎంత‌టి వారైనా స‌రే త‌ప్ప‌నిస‌రిగా పొదుపు పాటించాల‌ని స్ప‌ష్టం చేస్తారు. ఇక అజీమ్ ప్రేమ్ జీ స‌తీమ‌ణి సైతం నిత్యం సేవా కార్య‌క్ర‌మాల‌లో నిమ‌గ్న‌మై ఉంటారు.

ఈ త‌రుణంలో హైద‌రాబాద్ కు విచ్చేశారు అజీమ్ ప్రేమ్ జీ. ఈ సిటీలో విప్రో క‌న్ స్యూమ‌ర్ కేర్ ఫ్యాక్ట‌రీని ప్రారంభించారు. సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్(KTR )మాట్లాడారు.

విప్రో సంస్థ ఐటీ ప‌రంగానే కాదు ఇత‌ర రంగాల‌లో త‌న‌దైన ముద్ర క‌న‌బరుస్తోంద‌న్నారు. ప్ర‌త్యేకించి ఆయ‌న వ్య‌క్తిత్వం, జీవితం ఎంద‌రికో ఆద‌ర్శ ప్రాయ‌మ‌ని కొనియాడారు కేటీఆర్(KTR ).

నిన్న‌టి త‌రం ఆయ‌న నుంచి పాఠాలు నేర్చుకుంద‌ని, ఎన్నో మైలు రాళ్లు దాటిన ప్రేమ్ జీ జీవితం ఎంద‌రికో ఆద‌ర్శ ప్రాయమ‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు మంత్రి.

అజీమ్ ప్రేమ్ జీ లాంటి ఉన్న‌త‌మైన వ్య‌క్తి మ‌నంద‌రి మ‌ధ్య ఉండ‌టం మ‌నం చేసుకున్న అదృష్ట‌మ‌న్నారు. ఆయ‌న అనుస‌రించిన మార్గం ఎప్ప‌టికీ ఎన్న‌ద‌గిన‌ద‌ని పేర్కొన్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌నే ప్రేమ్ జీ మ‌న‌స్త‌త్వం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద‌న్నారు కేటీఆర్. రూ. 300 కోట్ల‌తో విప్రో ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల 900 మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని చెప్పారు మంత్రి.

Also Read : కోర్టుకు ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి సారీ

Leave A Reply

Your Email Id will not be published!