Dinesh Karthik : న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు

ఆట పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తా

Dinesh Karthik : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ 2022 లో భాగంగా ముంబైలో జ‌రిగిన మ్యాచ్ లో రాజ‌స్తాన్ కు చుక్క‌లు చూపించాడు.

ఒకానొక ద‌శ‌లో 5 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో దినేశ్ కార్తీక్ ఆదుకున్నాడు.

జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. షాబాజ్ అహ్మ‌ద్ తో క‌లిసి కీల‌క పాత్ర పోషించాడు.

రాజ‌స్థాన్ పై గెలుపొంద‌డంలో ముఖ్య పాత్ర పోషించిన దినేశ్ కార్తీక్(Dinesh Karthik) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. అనంత‌రం దినేశ్ కార్తీక్ మాట్లాడాడు.

తన ఫోక‌స్ అంతా ఆట‌పై ఉంటుంద‌ని, వేరే వాటి గురించి ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇత‌ర విష‌యాల‌పై దృష్టి పెడితే ఉన్న దానిపై వంద శాతం ఎఫ‌ర్ట్ పెట్ట‌లేమ‌న్నాడు.

అవ‌త‌ల ఎవ‌రు ఉన్నార‌నేది తాను ప‌ట్టించు కోన‌ని చెప్పాడు. ముందు బంతిపై ఉంటుంది, ఆ త‌ర్వాత బౌల‌ర్ గురించి ఆలోచిస్తాన‌ని పేర్కొన్నాడు.

కేవ‌లం 23 బంతులు ఎదుర్కొని 44 ర‌న్స్ చేయ‌డం మైదానం వెలుప‌ల ఉన్న వారికి త‌క్కువ స్కోరే అనిపిస్తుంద‌ని అన్నాడు. కానీ మైదానంలో ప‌రిస్థితి మ‌నం ఆశించినంత గొప్ప‌గా ఉండ‌ద‌న్నాడు.

ఎందుకంటే ఇరు జ‌ట్ల మ‌ధ్య గెలుపు సాధించాల‌ని ఉంటుంద‌ని ఆ స‌మ‌యంలో రెండు జ‌ట్లు పోరాడుతాయ‌ని తెలిపాడు దినేశ్ కార్తీక్.

క్రికెట్ ఆట‌లోకి ఎంట‌రైన ప్ర‌తి క్రికెట‌ర్ వంద శాతం బాగా ఆడాల‌ని అనుకుంటాడ‌ని కాని ఒక్కోసారి టైం మన వైపు ఉండ‌ద‌న్నాడు.

ఒక వేళ షాబాజ్ , తాను ఆడ‌క పోయి ఉండి ఉంటే క‌చ్చితంగా రాజ‌స్థాన్ గెలిచి ఉండేద‌న్నాడు. అయినా ఆ జ‌ట్టు కూడా చివ‌రి దాకా పోరాటం చేసింద‌ని కితాబు ఇచ్చాడు.

ఇదిలా ఉండ‌గా కార్తీక్ గ‌తంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో రూ. 5. కోట్ల 50 ల‌క్ష‌ల‌కు తీసుకుంది ఆర్సీబీ.

Also Read : కార్తీక్ క‌మాల్ ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!