KTR : విధుల‌కు అడ్డొస్తే ఊరుకోం – కేటీఆర్

ఎంఐఎం కార్పొరేట‌ర్ అరెస్ట్

KTR : విధులు నిర్వ‌హిస్తున్న పోలీసుల ప‌ట్ల దురుసుగా ఎవ‌రు ప్ర‌వ‌ర్తించినా లేదా కామెంట్ చేసినా ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోద‌ని స్పష్టం చేశారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR).

ఈ మేరకు ఎంత‌టి వారైనా, వారు ఏ స్థాయిలో ఉన్నా స‌రే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , తాత్సారం చేయొద్దంటూ సీరియ‌స్ అయ్యారు. ఈ మేర‌కు ఆయ‌న డీజీపీని కోరారు.

ఏ పార్టీకి చెందిన వారైనా స‌రే చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండ‌గా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఓ పార్టీకి చెందిన కార్పొరేట‌ర్ వ్య‌వ‌హార శైలి గురించి ఓ నెటిజ‌న్ మంత్రి దృష్టికి తీసుకు వ‌చ్చారు.

ఇది నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ఇదే విష‌యాన్ని డీజీపీకి కూడా తెలిపారు. పోలీసుల‌కు గౌర‌వం ఇవ్వ‌ని వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. దురుసుగా ప్ర‌వ‌ర్తించిన స‌ద‌రు వ్య‌క్తిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఈ కార్పొరేట‌ర్ వ్య‌వ‌హారం సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప‌రిస్థితిని గ‌మ‌నించిన మంత్రి వెంట‌నే డీజీపీకి ట్వీట్ చేశారు. ఎక్క‌డా ఉపేక్షించ వ‌ద్దంటూ సూచించారు డీజీపీకి.

సిటీలోని భోల‌క్ పూర్ డివిజ‌న్ లోని ప‌లు ప్రాంతాల్లో తెల్ల‌వారుజాము దాకా హోట‌ళ్లు , షాపులు తెరిచి ఉంచారు. వాటిని మూసి వేసేందుకు పోలీసులు అక్క‌డికి వెళ్లారు.

ఆ ప్రాంత ఎంఐఎం కార్పొరేట‌ర్ మ‌హ్మ‌ద్ గౌసుద్దీన్ అడ్డుకున్నారు. దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. రంజాన్ పండుగ సంద‌ర్భంగా తెరిచి ఉంచుతామ‌ని అన్నారు. మీరు రూ. 100కి ప‌ని చేసే మ‌నుషులంటా నోరు పారేసుకున్నాడు.

Also Read : అజీమ్ ప్రేమ్ జీ ఆద‌ర్శ ప్రాయుడు

Leave A Reply

Your Email Id will not be published!