Pat Commins : ఎందుకు ఐపీఎల్ పాపులర్ అయ్యిందో చెప్పాలంటే పాట్ కమిన్స్ (Pat Commins )ను చూడాలి. కమిన్సే కాదు అనామకులు అనుకున్న వాళ్లు అసాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. మరికొందరు ఊహించని రీతిలో రికార్డుల మోత మోగిస్తున్నారు.
ఇక అనుభవం కలిగిన ఆటగాళ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆట అంటే ఇలా ఉంటుంది. ఇలా కూడా ఆడ వచ్చా అని కళ్ల ముందే చేసి చూపించాడు పాట్ కమిన్స్ .
ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ కోల్ కతా నైట్ రైడర్స్ ఎందుకు ఎంచుకుందో ఇప్పుడు అర్థమై పోయి ఉంటుంది ప్రత్యర్థులకు. విధ్వంసం ఎలా ఉంటుందో. దంచి కొట్టడం ఎలా ఉంటుందో చేసి చూపించాడు కమిన్స్ .
ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా కూడా ఆడొచ్చు అంటూ నమ్మకాన్ని కలిగించాడు మరోసారి.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆశల పై నీళ్లు చల్లాడు. పాకిస్తాన్ నుంచి నేరుగా పూణె గడ్డపై కాలు మోపిన కమిన్స్ ఆకలి కొన్న పులిలా రెచ్చి పోయాడు. ప్రతి బంతిని బాదడం మొదలు పెట్టాడు.
కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు పాట్ కమిన్స్(Pat Commins ). ఐపీఎల్ లో అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. ఇక విజయం తమదేనని ఆశ పడిన రోహిత్ సేనకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు కమిన్స్ .
దీంతో హ్యాట్రిక్ పరాజయంతో బోణి కోసం ఎదురు చూస్తోంది ముంబై ఇండియన్స్. కమిన్స్ 15 బంతులు ఆడి 4 ఫోర్లు 6 సిక్స్ లు కొట్టాడు. ఇక వెంకటేశ్ అయ్యర్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు 41 బంతులు ఆడి 50 రన్స్ చేశాడు.
Also Read : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ డిక్లేర్