Imran Khan : పాకిస్తాన్ దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు ప్రధానమంత్రులుగా ఎవరూ ఉన్న చరిత్ర లేదు. ఆనాటి 1947 నుంచి నేటి 2022 సంవత్సరం దాకా ఏ ఒక్కరు ఐదేళ్ల పాటు పీఎంగా కొనసాగిన దాఖలాలు లేవు.
రాజకీయ నాయకుడిగా మారిన అరుదైన దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)సైతం ఇదే స్థితిని ఎదుర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే దేశంలో మూడో ప్రధానమంత్రి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ప్రతిపక్షాలకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును(Imran Khan) ఆశ్రయించారు.
పాకిస్తాన్ లో ప్రభుత్వం కంటే ఆర్మీ చేతిలోనే ఉందన్నది వాస్తవం. ఈ మొత్తం జర్నీలో ముగ్గురు ప్రధానులు నాలుగు సంవత్సరాల పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు.
మరో ఐదుగురు ఇమ్రాన్ ఖాన్ తో సహా మూడేళ్ల పాటు పీఎం లుగా కొనసాగారు. పాకిస్తాన్ లో ఇప్పటి వరకు 19 మంది ప్రధానులుగా పని చేశారు.
నవాజ్ షరీఫ్ మూడు సార్లు ప్రధానమంత్రిగా పని చేశారు. ఆయన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బెనజీర్ భుట్టో రెండు సార్లు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇతర ప్రధానుల మాదిరిగానే ఇద్దరు నేతలు కూడా తమ పదవీ కాలాన్ని పూర్తి చేయలేక పోయారు.
ఏడుగురు తాత్కాలిక ప్రధానమత్రులుగా ఉన్నారు. కాగా మూడు సార్లు పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వాలను పాకిస్తాన్ సైన్యం కూల దోసింది. 1958లో ఫిరోజ్ ఖాన్ నూన్ ను తొలగించింది.
జనరల్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో మార్షల్ లా స్థాపించబడింది. 1977లో జనరల్ జియా ఉల్ హక్ ఆపరేషన్ ఫెయిర్ ప్లే అనే పేరుతో జుల్ఫీకర్ అలీ భుట్టోను పదవీచ్యుతుడిని చేశారు.
మూడో సారి జనరల్ పర్వేజ్ ముషారఫ్ అక్టోబర్ 1999లో నవాజ్ షరీఫ్ పదవి పోగొట్టుకున్నాడు. పాకిస్తాన్ అధ్యక్షులుగా నలుగురు ఆర్మీలు చీఫ్ లుగా ఉన్నారు.
75 ఏళ్ల కాలంలో 32 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు. జనరల్ జియా 1978 నుంచి 1988 మధ్య ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదే సమయంలో ఆర్మీ చీఫ్ గా ఉన్నారు.
జనరల్ యహ్యా ఖాన 1969 నుంచి 1971 వరకు ఆర్మీ కమ్ చీఫ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. జనరల్ ముషారఫ్ 2001 నుంచి 2007 మధ్య ఈ ఫీట్ ను పునరావృతం చేశారు. ఇపపటి దాకా ఐదుగురు ప్రధానులు సైనిక చీఫ్ ల కింద పనిచేశారు.
Also Read : కత్తులు దూస్తున్న శివ సేన..బీజేపీ