DC vs LSG : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ఇవాళ ముంబైలో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్(DC vs LSG )3 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది నిర్ణీత 20 ఓవర్లలో. ఆశించిన మేర రాణించ లేక పోయాడు డేవిడ్ వార్నర్.
ఇక ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(DC vs LSG )లో స్టార్ ప్లేయర్ పృథ్వీ షా 61 పరుగులు చేసి సత్తా చాటాడు. అతడే అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 38 పరుగులు చేస్తే సర్ఫరాజ్ ఖాన్ 35 పరుగులు చేసి స్కోరు పెరిగేలా చేశారు.
లేక పోతే తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యేది ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీస్తే కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ తీశాడు. రోవ్ మెన్ పావెల్ మూడు పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇక ఎంతో ఆశ పెట్టుకున్న వార్నర్ ను బిష్ణోయ్ బోల్తా కొట్టించాడు. ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్ లో పృథ్వీ షా క్వింటన్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఇదిలా ఉండగా షా మైదానంలో ఉన్నంత సేపు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం కానుంది. అంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించారు బౌలర్లు. కానీ స్లో పిచ్ ఉండడంతో పరుగులు చేయడం కష్టంగా మారింది.
Also Read : పంత్ లా ఆ షాట్ ఆడాలని ఉంది