NV Ramana : సీజేఐ ర‌మ‌ణ కీల‌క కామెంట్స్

రాజ‌కీయ అంశాలు ఇక్క‌డ కాదు

NV Ramana  : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌లపాటి వెంక‌ట ర‌మ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయ అంశాలపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ అంశాల‌పై ఏమైనా అనుమానాలు కానీ లేదా అభ్యంత‌రాలు ఉన్న‌ట్ల‌యితే ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల‌ని సూచించారు సీజేఐ. వీటిని ప‌రిశీలించేందుకు వాటికే అధికారం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌(NV Ramana ).

ప్ర‌జ‌లు ఎన్న‌కున్న ప్ర‌భుత్వానికి వీటిని ప‌రిశీలించేందుకు ప‌వ‌ర్ఉంద‌న్నారు. ప‌శ్చిమ బెంగాల్ ద్వారా ఇండియాలోకి అక్ర‌మంగా రోహింగ్యాలు, బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు అక్ర‌మంగా చొర‌బ‌డుతున్నారంటూ పిటిష‌న్ దాఖ‌లైంది.

వీరిని గుర్తించి, నిర్బంధించి దేశం నుంచి బ‌హిష్క‌రిచాల‌ని దావాలో కోరారు పిటిష‌న‌ర్ న్యాయ‌వాది అశ్వినీకుమార్. ఈ పిటిష‌న్ పై సీజేఐ ఎన్.వి.ర‌మ‌ణ(NV Ramana )నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ముందు ప్ర‌స్తావించారు.

ఈ సంద‌ర్భంగా సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో పాటు ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు ఎన్నుకుంటారు. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల‌లో దేశంలో ప్ర‌భుత్వాలు కొలువు తీరి ఉన్నాయి.

నామినేష‌న్ వేయ‌డం, ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల్ని కేంద్రం చేయాల్సి ఉంటుంది. ఇవి ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వాలు చేయాల్సిన బాధ్య‌త అని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యాల‌ను విచార‌ణ‌కు స్వీక‌రించాల్సి వ‌స్తే ఇక ప్ర‌భుత్వాలు ఎందుకు ఉన్న‌ట్లు ప్ర‌శ్నించారు ఎన్ వీ ర‌మ‌ణ‌. చ‌ట్టాలు చేసేందుకు రాజ్య‌స‌భ‌, లోక స‌భ ఉన్నాయి. వాటిని సంస్క‌రించాల్సిన బాధ్య‌త ఆయా ప్ర‌భుత్వాల‌పై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ఇ-సైకిళ్లు కొంటే స‌బ్సిడీ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!