AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ పూర్తయింది. ఈ తరుణంలో కొలువు తీరిన 24 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ తరుణంలో రాజీనామా పత్రాలను గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కు ప్రభుత్వం సమర్పించింది.
ఈసారి కేబినెట్ లో ముగ్గురు లేదా నలుగురు పాత వారికి చాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. 17 నుంచి 20 మందిని కొత్త వారికి అవకాశం రానున్నట్లు టాక్. ఇప్పటికే వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP Cabinet) జాబితాను సిద్దం చేశారు.
ఇందులో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణలే ఇందులో ప్రభావం చూపనున్నాయి. ఆయా ఎమ్మెల్యేలు, పనితీరు, అనుభవం, కుల ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు.
ఇక రెడ్డి, కాపు, బీసీ, మైనార్టీ, ఎస్సీ లకు మంత్రివర్గంలో ఛాన్స్ లభించనుంది. మహిళలకు కూడా ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు జగన్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, మేయర్లు, ఎంపీపీలు ఇలా ప్రతి దాంట్లోనూ సీఎం సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు.
ఇక మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోనూ (AP Cabinet) ఆయా కులాలకు ప్రయారిటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కనున్నట్లు టాక్.
ఇంకా కేబినెట్ మంత్రులతో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈనెల 10 రాత్రి వరకు ఎవరు ఉంటారనేది తేలి పోతుంది.
Also Read : పవన్ మాటల్ని ప్రజలు నమ్మరు