Ravi Shastri : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రిచ్ లీగ్ పై భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భారత జట్టు కు సంబంధించి మూడు ఫార్మాట్ లకు రోహిత్ శర్మను బీసీసీఐ డిక్లేర్ చేసింది.
ఇక త్వరలోనే ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఎవరిని ఎంపిక చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఐపీఎల్ లో సత్తా చాటిన వాళ్లకు ఎక్కువగా ప్రయారిటీ ఉంటుందనేది వాస్తవం.
కానీ తుది జట్టులో ఎవరు ఉంటారనేది చెప్పలేం. తాజాగా జరగబోయే వరల్డ్ కప్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రవి శాస్త్రి(Ravi Shastri ). భారత జట్టుకు తప్పనిసరిగా ఓ ఫినిషర్ రూపంలో ఆటగాడు ఉండాలని పేర్కొన్నాడు.
గతంలో ఎంఎస్ ధోనీ ఉండేవాడని ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులైన ఆటగాళ్లు ఎవరనే దానిపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. తన వరకైతే ధోనీ కి బదులు ఆ ప్లేస్ లో ఫినిషర్ గా దినేశ్ కార్తీక్ అయితే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ లో ఊహించని రీతిలో ఓడి పోయే మ్యాచ్ ను మలుపు తిప్పాడు కార్తీక్. ఒకానొక దశలో రాజస్థాన్ రాయల్స్ గెలుపు అంచుల దాకా నిలబడింది.
కానీ దినేశ్ కార్తీక్ పూర్తిగా ఆట స్వరూపాన్ని మార్చేశాడు. జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. 90కి పైగా స్ట్రైక్ రేట్ కలిగిన దినేశ్ కార్తీక్ అయితే బాగుంటుందన్నాడు. వయసు పరంగా చూడడం కంటే ఆట పరంగా చూడాలన్నాడు రవిశాస్త్రి.
Also Read : భారత జట్టుకు ఫినిషర్ అవసరం