Russia Ukraine War : ర‌ష్యా రాకెట్ దాడిలో 35 మంది మృతి

100 మందికి పైగా తీవ్ర గాయాలు

Russia Ukraine War  : ఉక్రెయిన్ పై ఏక‌ప‌క్ష దాడులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్ లోని క్రామాటోర్స్క్ లోని పౌరుల‌ను త‌ర‌లించేందుకు ఉప‌యోగిస్తున్న రైలు స్టేష‌న్ పై శుక్ర‌వారం ర‌ష్యా రాకెట్ దాడికి(Russia Ukraine War )పాల్ప‌డింది.

ఈ అనుకోని ఘ‌ట‌న‌లో అక్క‌డిక‌క్క‌డే 35 మంది మృతి చెందారు. మ‌రో 100 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక లెక్క‌ల ప్ర‌కారం భారీ ఎత్తున ప్రాణ న‌ష్టం సంభ‌వించింది.

ఇంకా లెక్కించ లేనంత‌గా ఆస్తి న‌ష్టం వాటిల్లింది. 5 వేల మందికి పైగా చిన్నారులు, మ‌హిళ‌లు, వృద్దులు, పౌరులు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆ దేశం స్వ‌యంగా ప్ర‌క‌టించింది.

ఇవాళ జ‌రిగిన రాకెట్ దాడి గురించి స్వ‌యంగా ఉక్రెయిన్ లోని రైల్వే స్టేష‌న్ నిర్వాహ‌కులు ధ్రువీక‌రించారు. ర‌ష్యా రాకెడ్(Russia Ukraine War )దారి త‌ర్వాత ర‌ష్యాపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ.

వారు యుద్ద నేరానికి పాల్ప‌డుతున్నార‌ని, ఎక్క‌డా మాన‌వ‌త్వాన్ని చూప‌డం లేద‌ని ఆరోపించారు. ఇది హ‌ద్దులు లేని దుర్మార్గ‌మ‌ని పేర్కొన్నారు. ఇక నైనా యావ‌త్ ప్ర‌పంచం మేలు కోవాల‌ని లేక‌పోతే ఇది ఎప్ప‌టికీ ఆగ‌ద‌న్నాడు.

ఇదిలా ఉండ‌గా బ్రిట‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కుమార్తెల‌ను త‌న ఆంక్ష‌ల జాబితాలో చేర్చింది. ఇప్ప‌టికే అమెరికా ముందుగా వారిపై ఆంక్ష‌లు విధించిన సంగ‌తి విధిత‌మే.

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్యాన్యేయేల్ రాకెట్ దాడిని తీవ్రంగా ఖండించారు. దీనికి త‌గిన మూల్యం చెల్లించుకునే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు.

Also Read : ఖాన్ సాబ్ కు సుప్రీంకోర్టు షాక్

Leave A Reply

Your Email Id will not be published!