RCB vs MI IPL 2022 : మెరిసిన సూర్య ఆర్సీబీ టార్గెట్ 152

రాణించిన రోహిత్ శ‌ర్మ‌..ఇషాన్ కిష‌న్

RCB vs MI IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ అతి క‌ష్టం మీద 151 ప‌రుగులు చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆ మాత్రం స్కోర్ చేసేందుకు నానా తంటాలు ప‌డింది.

స‌హ‌చ‌రులు విఫ‌ల‌మైనా సూర్య భాయ్ ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. కేవ‌లం 37 బంతులు ఆడిన యాద‌వ్ 68 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇందులో 5 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆరు వికెట్లు కోల్పోయి ఆ మాత్రం ప‌రుగులు చేసింది ఆ జ‌ట్టు. సూర్య కుమార్ యాద‌వ్ తో పాటు రోహిత్ శ‌ర్మ 26, ఇషాన కిష‌న్ 26 ర‌న్స్ చేయ‌గా ఆఖ‌రులో వ‌చ్చిన ఉనాద్క‌త్ 13 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.

ఇక రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB vs MI)త‌ర‌పున హ‌ర్ష‌ల్ ప‌టేల్ , హ‌స‌రంగా చెరో రెండు వికెట్లు తీశారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడ‌గొట్టాడు. కీర‌న్ పోలార్డ్ డ‌కౌట్ అయ్యాడు.

ముంబై ఇండియ‌న్స్ (RCB vs MI)దారుణ‌మైన ఆట తీరును క‌న‌బ‌ర్చింది. కేవ‌లం 62 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో సూర్య కుమార్ యాద‌వ్ ఆప‌ద్బాంధ‌వుడిలా ఆదుకున్నాడు.

మొత్తం మీద ఈరోజు వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్ ల‌లోను ముంబై ఇండియ‌న్స్ ఇంత వ‌ర‌కు బోణీ కొట్ట లేదు. మ‌రో వైపు చెన్నై సూప‌ర్ కింగ్స్ ముచ్చ‌ట‌గా ఇవాళ నాలుగో మ్యాచ్ కూడా ఓడి పోయింది. ఆర్సీబీ ముందు సుల‌భ‌మైన స్కోర్ మిగిలి ఉంది.

Also Read : మెరిసిన సూర్య ఆర్సీబీ టార్గెట్ 152

Leave A Reply

Your Email Id will not be published!