RR vs LSG : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఇవాళ అసలైన పోరాటానికి తెర తీయనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్(RR vs LSG )మధ్య ఆసక్తికర మ్యాచ్ కు వేదిక కానుంది.
జట్ల పరంగా చూస్తే రాజస్థాన్ కు స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ సారథ్యం వహిస్తుండగా లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు.
ఇద్దరూ ఇద్దరే. కానీ జట్టు విజయం సాధించాలంటే శాంసన్ రాణించాల్సి ఉంటుంది.
లేక పోతే కష్టం. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు గెలిచి ఒకటి ఓడి పోయింది.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ కూడా సేమ్ సీన్. ఇదిలా ఉండగా ఇరు జట్లకు ఈ లీగ్ మ్యాచ్ అత్యంత కీలకమైనది.
ప్లే ఆఫ్ చేరుకోవాలంటే గెలవక తప్పదు. జట్ల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు (RR vs LSG )సంజూ శాంసన్ కెప్టెన్. జోస్ బట్లర్ , రాస్సీ వాన్ డస్సెస్ , దృవ్ జురెల్, జేమ్స్ నీషమ్ , శుభమ్ గర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయర్ , దేవదత్ పడిక్కల్ , యజువేంద్ర చహల్ ఆడనున్నారు.
వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథన్ కౌల్టర్ నైల్ , రవిచంద్రన్ అశ్విన్ , ప్రసీద్ కృష్ణ, తేజాస్ బరోకా, ఓబెద్ మెకాయ్,
రియాన్ పరాగ్, డారిల్ మిచెల్ , అనునయ్ సింగ్ , యశస్వి జైస్వాల్ , నవదీప్ సైనీ, కరుణ్ నాయర్, కేసి కరియప్ప, కుల్దీప్ యాదవ్ ఆడతారు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బదోని, కర్ణ్ శర్మ, కైల్ మేయర్స్ ,
అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మయాంక్ యాదవ్ , క్వింటన్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేసన్ హోల్డర్ ఆడతారు.
మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , రవి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్కస్ స్టోయినిస్ , మననో వోహ్రా, దుష్మంత్ చమీరా, దీపక్ హూడా, కృష్ణప్ప గౌతమ్ ఆడనున్నారు.
Also Read : చేతులెత్తేసిన చెన్నై హైదరాబాద్ విక్టరీ