CSK vs MI : విచిత్రకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి దిగ్గజ జట్లు. ఇప్పటికే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ హిస్టరీలో అత్యధిక టైటిళ్లను గెలుపొందిన చరిత్ర ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs MI ) లకు ఉంది.
సీఎస్కే ఐదుసార్లు చేజిక్కించుకుంటే నాలుగుసార్లు టైటిళ్లను కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్ . ఈ రెండు జట్లకు ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ కలిసి రానట్లుంది.
ఇప్పటి వరకు ముంబై ఆడియన నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఇంక సేమ్ సీన్ చెన్నై కూడా ఇదే బాట పట్టింది. ఒకరి తర్వాత మరొకరు జట్టుకు భారంగా మారుతున్నారు.
విచిత్రం ఏమిటంటే గత ఏడాది ఐపీఎల్ లో సీఎస్కే (CSK vs MI ) ను విజేతగా నిలిపాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈసారి తను తప్పుకున్నాడు. రవీంద్ర జడేజాకు అప్పగించింది సీఎస్కే యాజమాన్యం సారథ్య బాధ్యతల్ని. కానీ జట్టు ఆట తీరులో మార్పు లేదు.
ఎక్కడా ధీటైన జవాబు ఇచ్చే పరిస్థితిలో లేక పోవడం దారుణం. కోట్లు పోగేసి కొనుగోలు చేసింది ఇందుకేనా అని ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్ కు ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు.
గత ఏడాది పేలవమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్ కు చేరకుండానే ఇంటి బాట పట్టింది ముంబై. ఈసారి అసలుకే మోసం వచ్చేలా ఉంది ఆ జట్టు ఆట తీరు చూస్తుంటే. ఫ్యాన్స్ మాత్రం ముంబై, చెన్నై జట్ల ఆట తీరుపై మండి పడుతున్నారు.
Also Read : ‘సూర్య’ భాయ్ జీతే రహో