Asad Qaiser : సుప్రీంకోర్టు ఆదేశాలు స్పీక‌ర్ బేఖాత‌ర్

పీఎం ఇమ్రాన్ ఖాన్ తో 30 ఏళ్ల బంధం

Asad Qaiser  : పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం కొన‌సాగింది. 14 గంట‌ల పాటు సాగిన ఈ కార్య‌క్ర‌మం ఎట్ట‌కేల‌కు ముగిసింది. పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ విశ్వాసం చూర‌గొన‌లేక పోయారు.

గ‌ట్టెక్కాలంటే 172 ఓట్లు కావాల్సి ఉండ‌గా 170 ఓట్లు మాత్ర‌మే పోల్ అయ్యాయి. ఈ త‌రుణంలో 2 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఉన్న పీఎం ప‌ద‌విని కోల్పోయారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌తిప‌క్షాలు స్పీక‌ర్ అనుస‌రిస్తున్న తీరుపై ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. దీంతో ఉన్న‌ప‌ళంగా ఎలా ర‌ద్దు చేస్తారంటూ ప్ర‌శ్నించింది కోర్టు ధ‌ర్మాస‌నం.

ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మంటూ పేర్కొంది. వెంట‌నే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాల‌ని ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ను సేవ్ చేసేందుకు చివ‌రి దాకా ప్ర‌య‌త్నం చేశారు స్పీక‌ర్ అస‌ద్ ఖైజ‌ర్(Asad Qaiser ). పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ ప్ర‌ధాని ఇమ్రాన్ నియాజీ ఆదేశాల మేర‌కు స్పీక‌ర్ న‌డుచుకున్నారు.

కానీ ఇప్పుడు నియాజీ ఓడి పోవ‌డంతో స్పీక‌ర్ పై వేటు ప‌డే ఛాన్స్ ఉంది. అంతే కాదు కోర్టు ఆదేశాలు ధిక్క‌రించినందుకు కూడా ఆయ‌న శిక్షార్హుడు కాబోతున్నాడు. త‌న‌ను తాను బ‌హిర్గ‌తం చేసుకోవ‌డ‌మే కాదు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసేలా చేశాడు.

అసెంబ్లీ లేదా పార్ల‌మెంట్ లో స్పీక‌ర్ ప‌ద‌వి పార్టీల‌కు అతీతంగా , రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా ఉంటుంద‌ని భావించినా ఖైజ‌ర్(Asad Qaiser )పీఎం నియాజీతో అంట‌కాగ‌డం, వ‌త్తాసు ప‌ల‌క‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చారు. అసెంబ్లీ స‌మావేశాన్ని వాయిదా వేశారు. ప్ర‌తిప‌క్షాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాకే 9న ఓటింగ్ కు ఓకే చెప్పారు. దీంతో స్పీక‌ర్ అస‌ద్ ఖైజ‌ర్ , డిప్యూటీ స్పీక‌ర్ ఖాసిం సూరి రాజీనామా చేశారు.

Also Read : ఇమ్రాన్ ఖాన్ దేశం విడిచి వెళ్లొద్దు

Leave A Reply

Your Email Id will not be published!