Seeta Rama Kalyanam : దేశ వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది. అభిజిత్ ముహూర్తంన సీతా రాముడి కళ్యాణం(Seeta Rama Kalyanam) అంగరంగ వైభవంగా జరిగింది.
వేలాది మంది భక్తులు తరలి వచ్చారు తండోప తండాలుగా కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు. ఇక దేశమంతటా సీత, రాముడి పెళ్లి కొనసాగింది.
భక్త శ్రీరామ దాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రాముడు పెళ్లి కొడుకుగా , సీతమ్మ పెళ్లి కూతురుగా దర్శనం ఇచ్చారు. సరిగ్గా శుభ ముహూర్తం 12 గంటలకు స్వామి, అమ్మ వార్లకు జిలకర్ర, బెల్లం పెట్టారు.
అనంతరం వేదమంత్రోశ్చారణల మధ్య మాంగళ్య ధారణ జరిగింది. ఇక రాములోరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ , రవాణా శాఖ మంత్రుల దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామి, అమ్మ వార్తలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలుగా భక్తులను అనుమతించలేదు తెలంగాణ ప్రభుత్వం.
ఈసారి సీతా రాముల కళ్యాణోత్సవానికి(Seeta Rama Kalyanam) అనుమతి ఇచ్చింది సర్కార్. దీంతో భద్రాచలం ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ పేరుతో దద్దరిల్లింది. అంతే కాకుండా మిథిలా స్టేడియం క్రిక్కిరిసి పోయింది.
ఆలయ వీధులన్నీ భక్తులతో నిండి పోయాయి. ఇదిలా ఉండగా శ్రీరామ నామ స్మరణతో భద్రగిరి మారుమ్రోగింది. ఎటు చూసినా సీతా రాముల కళ్యాణం చూతము రారండి అంటూ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
Also Read : స్వామి నారాయణ్ ఆలయంలో సీఎంలు