KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. మతం, కులం, ప్రాంతాల పేరుతో రాజకీయం చేస్తోందంటూ ఆరోపించారు.
ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందని, నిరుద్యోగిత రేటు అధికంగా ఉందని ఈరోజు వరకు ఒక్క నిర్ణయం తీసుకున్న పాపాన పోలేదన్నారు కేటీఆర్. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై ఆయన స్పందించారు.
ప్రజలను వైషమ్యాల పేరుతో రెచ్చ గొట్టడం ఎన్నికల్లో లబ్ది పొందడం తప్ప మరో కార్యక్రమం చేపట్ట లేదంటూ మండిపడ్డారు. తనకు చిన్నప్పటి నుంచి బెంగళూరు అంటే అభిమానమని కానీ ఇప్పుడు దానిని మత విద్వేషాలకు అడ్డాగా మార్చేస్తున్నారంటూ మండిపడ్డారు.
దీని వల్ల ఆ రాష్ట్రంపై పెను ప్రభావం పడుతుందన్నారు కేటీఆర్(KTR). ఇది దేశానికి, రాష్ట్రానికి మంచి పద్దతి కాదని సూచించారు మంత్రి. బెంగళూరు అనేది ఐటీ హబ్ మాత్రమే కాదని ఇండియాకు ఓ సిలికాన్ వ్యాలీ లాంటిదని స్పష్టం చేశారు.
ఆ పేరు లేకుండా చేయాలని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం తీరు, నిర్ణయాల వల్ల ఆ నగరం ఇప్పుడు దేశంలోనే విద్వేషపు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్(KTR).
హిజాబ్ , హలాల్ వంటి విధానాల వల్ల దేశంలోని సామాన్యలు, పేదలు, ఇతర వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీజేపీ తన తప్పు తెలుసుకుని తన విధానాలను మార్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : ప్రయాణీకులకు ఆర్టీసీ బిగ్ షాక్