Shimron Hetmyer : రాజస్థాన్ రాయల్స్ ఏ ముహూర్తాన ఐపీఎల్ వేలం పాటలో హెట్ మైర్ ను కొనుగోలు చేసిందో కానీ వారి నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు స్టార్ క్రికెటర్ హెట్ మైర్. కళ్లు చెదిరేలా షాట్స్ ఆడడం. ప్రత్యర్థుల గుండెల్లో నిద్ర పోవడం అతడికి హాబీగా మారింది.
ఐపీఎల్ 2022లో ఇప్పుడు అన్ని జట్లు ఈ విధ్వంసకర ఆటగాడి మీద ఫోకస్ పెట్టాయి. అంతలా మోస్ట్ డేంజరస్ ప్లేయర్ గా పేరొందాడు. ఒకానొక దశలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన తన జట్టుకు ఆక్సిజన్ లా మారాడు.
దుమ్ము రేపాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన సహజ సిద్దమైన ఆటకు స్వస్తి పలుకుతూ అటాకింగ్ చేయడం మొదలు పెట్టాడు హెట్ మైర్(Shimron Hetmyer).
నిర్ణీత 20 ఓవర్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్ మైర్ 36 బంతులు ఆడి ఒక ఫోర్ 6 సిక్సర్లతో 59 రన్స్ చేశాడు.
అతడికి తోడుగా దేవదత్ పడిక్కల్ 29 రన్స్ చేస్తే రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఏ ఒక్క బౌలర్ ను వదిలి పెట్టలేదు హెట్ మైర్(Shimron Hetmyer). సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
కళ్లు మూసే లోపా సిక్సర్లను బౌండరీ లైన్ ను దాటించాడు . ఇక లీగ్ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఆర్ఆర్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. రాజస్థాన్ ఈ మ్యాచ్ లో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది.
Also Read : డీలా పడిన డిఫెండింగ్ ఛాంపియన్స్