NITI Aayog : నీతి ఆయోగ్ లిస్టులో గుజ‌రాత్ టాప్

స్టేట్ ఎన‌ర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్

NITI Aayog : గుజ‌రాత్ స్టేట్ టాప్ లో నిలిచింది. అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఈ విష‌యాన్ని ఇవాళ నీతి ఆయోగ్ (NITI Aayog)స్టేట్ ఎన‌ర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ జాబితాను విడుద‌ల చేసింది.

ఈ లిస్టులో టాప్ లో నిలిచింది గుజ‌రాత్. ఇక మిగ‌తా రాష్ట్రాల‌ను చూస్తే కేర‌ళ రెండో స్థానంలో నిలిచింది. ప్ర‌భుత్వ థింక్ ట్యాంక్ నివేదిక‌లో మూడో స్థానం ద‌క్కించుకుంది పంజాబ్ రాష్ట్రం.

స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1 (సెసీ) లో గుజ‌రాత్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇది డిస్క్ మ్ ల ప‌నితీరు, ఇంధ‌న సామ‌ర్థ్యం , ప‌ర్యావ‌ర‌ణ సుస్థిర‌త‌తో స‌హా ఆరు పారా మీట‌ర్స్ పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సంబంధించి ర్యాల‌కుల‌ను కేటాయించింది.

ప్ర‌తి ఏటా ఈ జాబితాను విడుద‌ల చేస్తుంది. ఇదిలా ఉండ‌గా ఇక మొత్తం రాష్ట్రాలు, యూటీఐల ప‌రంగా చూస్తే ఛ‌త్తీస్ గ‌ఢ్ , మ‌ధ్య ప్ర‌దేశ్ , జార్ఖండ్ త‌దిత‌ర రాష్ట్రాలు అట్ట‌డుగున నిలిచాయి.

ఇక చిన్న రాష్ట్రాల ప‌రంగా చూస్తే నీతి ఆయోగ్(NITI Aayog) సూచీలో గోవా అగ్ర స్థానంలో నిలిచింది. త‌ర్వాతి స్థానాల్లో త్రిపుర‌, మ‌ణిపూర్ ఉన్నాయి.

డిస్కమ్ ల ప‌నితీరు, యాక్సెస్ స్థోమ‌త‌, శ‌క్తి విశ్వ‌స‌నీయ‌త‌, స్వ‌చ్ఛ‌మైన శ‌క్తి కార్య‌క‌ర‌మాలు, శ‌క్తి సామ‌ర్థ్యం, ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌, నూత‌న కార్య‌క్ర‌మాలు ఇందులో ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు.

వీటి ఆధారంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ర్యాంకులు కేటాయించింది నీతి ఆయోగ్ . ఇందులో మొత్తం 27 పారా మీట‌ర్స్ ను చేర్చారు.

Also Read : రాముడి పేరుతో బీజేపీ రాజ‌కీయం

Leave A Reply

Your Email Id will not be published!