Modi : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) అనుమతిస్తే ప్రపంచానికి ఆహార నిల్వలను సరఫరా చేసేందుకు భారత్ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi ).
అమెరికా చీఫ్ బైడెన్ తో మాట్లాడిన అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అవసరానికి మించి ఆహార నిల్వలు పేరుకు పోయాయని తెలిపారు.
ప్రధాన మంత్రి మోదీ మంగళవారం శ్రీ అన్నపూర్ణ ధామ్ లోని హాస్టల్ , విద్యా సముదాయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలకంగా మాట్లాడారు.
డబ్ల్యుటీఓ పర్మిషన్ ఇస్తే ప్రపంచానికి ఆహార నిల్వలు సరఫరా చేసే సత్తా ఇండియాకు ఉందన్నారు మోదీ. మన సంప్రదాయాలు, సంస్కృతిలో ఆహారం, ఆరోగ్యం, విద్యకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పారు ప్రధానమంత్రి.
అన్నపూర్ణ ధామ్ మరింత విస్తరించిందన్నారు. గుజరాత్ లోని సామాన్య ప్రజలు దీని నుంచి ఎంతో ప్రయోజనం పొందుతారని చెప్పారు మోదీ(Modi ). పాటిదార్ కమ్యూనిటీని ఆకాశానికి ఎత్తేశారు.
ప్రతి సమాజం తన సామాజిక బాధ్యతను నెరవేర్చడం గుజరాత్ స్వభావం అని పేర్కొన్నారు. పనిలో పనిగా కెనడా నుంచి ఉత్తర ప్రదేశ్ లోని వారణాసికి పురాతన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని సురక్షితంగా తిరిగి తీసుకు రావడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు ప్రధాని.
100 ఏళల కిందట 1913లో పవిత్రమైన వారణాసి లోని ఒక ఆలయం నుంచి విగ్రహం చోరీ అయ్యింది. దేశం నుంచి అక్రమంగా తరలించారు. కెనడా లో ఉన్న దానిని ఇక్కడికి తీసుకు వస్తున్నారు.
Also Read : జై శంకర్ కు ప్రియాంక కితాబు