TTD EO : గతంలో ఎన్నడూ లేని రీతిలో తిరుమలకు భారీగా పోటెత్తారు భక్తులు. ఊహించని రీతిలో తరలి రావడంతో తిరుమల భక్త జన సందోహంతో నిండి పోయింది.
చాలా మందికి దర్శనం దొరకడం లేదని, సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ(TTD EO) విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు భారీగా వస్తారని తమకు ముందే తెలుసని చెప్పారు. ఆ మేరకు భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేశామన్నారు. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
ఇందులో భాగంగా భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి టోకెన్లు లేకుండానే స్వామి దర్శనం కోసం పర్మిషన్ ఇచ్చామన్నారు. అంతే కాకుండా ఆయా కాటేజ్ లలో దర్శనం కోసం ఉన్న వారికి భోజనం, చిన్నారులకు పాలు, నీళ్లు అందజేస్తున్నామని వెల్లడించారు.
ప్రతి ఒక్కరికీ శ్రీవారి దర్శనం కల్పించేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ధర్మారెడ్డి(TTD EO). ఇదిలా ఉండగా రెండు సంవత్సరాల తర్వాత తిరుమల లోని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి పోయాయి.
అద్దె గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఇక తలనీలాల కోసం మూడు నాలుగు గంటల సమయం పడుతోంది. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం దాకా రద్దీగా మారింది.
రద్దీ పెరగడంతో ఆదివారం వరకు స్పెషల్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఇక వెంకన్న దర్శనం కావాలంటే కనీసం 30 గంటల దాకా సమయం పడుతోంది.
Also Read : ‘గజపతి’కే సింహాచలం ‘పగ్గం’