Akbaruddin Owaisi : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి ఊరట లభించింది. ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారంటూ నాంపల్లి కోర్టులో కేసు నమోదైంది. ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి కోర్టు విచారణ చేపట్టింది.
అక్బరుద్దీన్ పై ఇప్పటి వరకు రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులను విచారించింది ధర్మాసనం. ఈ మేరకు బుధవారం రెండు కేసులను కొట్టి వేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
సరిగ్గా 9 సంవత్సరాల కిందట నిజామాబాద్ , నిర్మల్ లో మత విద్వేషాలను రెచ్చ గొట్టేలా కామెంట్స్ చేశారంటూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్(Akbaruddin Owaisi )పై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులకు సంబంధించి 30 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన అక్బరుద్దీన్ ఓవైసీ ఏకంగా 40 రోజుల పాటు చెరసాలలో ఉన్నారు.
నాంపల్లి కోర్టు ఈ మేరకు ఎమ్మెల్యను నిర్దోషిగా ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా కోర్టు ధర్మాసనం ఆసక్తికర , కీలక వ్యాఖ్యలు చేసింది.
అక్బరుద్దీన్ ఓవైసీనీ ఈ కేసులకు సంబంధించి నిర్దోషిగా ప్రకటించినంత మాత్రాన భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యాలు చేయమని కాదని స్పష్టం చేసింది.
కోర్టు సీరియస్ గా కామెంట్స్ చేసింది. ఇక నుంచి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు భారత దేశ సమగ్రతకు మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించడం విశేషం.
ఇదే సమయంలో కేసు కొట్టి వేసినంత మాత్రాన సంబురాలు చేసుకోవద్దంటూ స్పష్టం చేసింది కోర్టు. కాగా హైదరాబాద్ లోని పాత బస్తీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు ముందు జాగ్రత్తగా.
Also Read : రూ. 200 కోట్లతో బీవీఎస్ పెట్టుబడి