Shikhar Dhawan : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో జరిగిన కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. వరుసగా ఆ జట్టుకు ఇది ఐదో పరాజయం. రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బరిలోకి దిగింది.
నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. చివరి దాకా జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 12 రన్స్ తేడాతో విజయం సాధించింది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) ను ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏరి కోరి తీసుకుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు ధావన్.
ఏకంగా ధనా దన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా హయ్యెస్ట్ స్కోర్ చేశాడు. మొత్తం 70 పరుగులతో సత్తా చాటాడు . హిట్టర్ ధావన్ తో పాటు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సైతం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
52 పరుగులు చేసి రాణించాడు. ఇక చివరలో వచ్చిన జితేశ్ శర్మ మెరుపులు మెరిపించాడు. దీంతో 198 రన్స్ చేసింది పంజాబ్. ఈ భారీ స్కోర్ సాధించేందుకు చివరి ఓవర్ దాకా ప్రయత్నం చేసింది ముంబై ఇండియన్స్ .
కానీ చేజేతులారా ఓటమి పాలైంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం ముంబైని కొంప ముంచింది. ఇక ధవన్ (Shikhar Dhawan)ఇన్నింగ్స్ లో ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి.
ఇక ధావన్ భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. శ్రీలంకలో పర్యటించిన భారత క్రికెట్ జట్టు బి – టీంకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
Also Read : ఆటను వదిలేయండి దేశం కోసం రండి