Michael Vaughan : ఐపీఎల్ 2022లో అద్భుతమైన సన్నివేశానికి వేదికైంది ముంబై. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాఫ్రికా స్టార్ హిట్టర్ డెవాల్ట్ బ్రెవిస్ ఆడిన ఆట తీరుపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
ఈ సందర్భంగా అద్భుతమైన సిక్స్ లు కొట్టాడు. ఐపీఎల్ మెగా వేలంలో డెవాల్ట్ బ్రెవిస్ ను కొనుగోలు చేసి మంచి పని చేశారని కితాబు ఇచ్చాడు మైఖేల్ వాన్(Michael Vaughan). ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ లో దుమ్ము రేపాడు.
సఫారీ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెవాల్ట్ బ్రెవిస్ కేవలం 6 మ్యాచ్ లలో 506 పరుగులు చేశాడు. తన అటాకింగ్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడని వాన్ పేర్కొన్నాడు. సామాన్యంగా మైఖేల్ వాన్(Michael Vaughan) ఎవరినీ ప్రశంసించడు.
రూ. 20 లక్షల బేస్ ధరకు వేలం పాటలోకి వచ్చాడు. తాజాగా రూ. 3 కోట్లకు అమ్ముడు పోయాడు ముంబై ఇండియన్స్ కు. ఇక నిన్న జరిగిన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు చెందిన లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ పై వరుసగా 4 సిక్సర్లు బాదాడు డెవాల్ట్ బ్రెవిస్.
కేవలం 25 బంతులు ఆడి 49 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా బ్రెవిస్ ను ఆకాశానికి ఎత్తేశాడు మైఖేల్ వాన్. ఇప్పటికే బ్రెవిస్ అద్భుతమైన ఆటగాడిగా రూపుదిద్దుకున్నాడు.
ఎంత గొప్ప ప్రారంభ సంతకం చేశాడంటూ పేర్కొన్నాడు మైకేల్ వాన్. ఏకంగా 112 మీటర్ల దూరంలో భారీ సిక్స్ బాదడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
Also Read : ముంబై ఇండియన్స్ టార్గెట్ 199