Rahul Tripathi : రాహుల్ త్రిపాఠి పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది. ఈసారి ఏరికోరి గత ఫిబ్రవరి నెలలో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ సిఇఓ కావ్య మారన్ ఏరికోరి తీసుకుంది.
అందుకేనేమో దుమ్ము రేపాడు. స్టార్టింగ్ లో ఓటమి పాలైనా సన్ రైజర్స్ గాడిన పడింది. మెల మెల్లగా విజయాలు నమోదు చేసుకుంటూ ఆసక్తిని రేపుతోంది. డేవిడ్ వార్నర్ ను వద్దనుకుని న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కు పగ్గాలు ఇచ్చింది.
అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. తాజాగా ఐపీఎల్ 2022లో టైటిల్ ఫెవరేట్ గా పేరొందిన కోల్ కతా నైట్ రైడర్స్ కు చుక్కలు చూపించాడు రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi).
మనోడు గతంలో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 176 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే కథ ముగించేసింది హైదరాబాద్. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేదించింది.
ఇందులో ప్రధానంగా చెప్పు కోవాల్సింది రాహుల్ త్రిపాఠి గురించి. కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న త్రి పాఠి 71 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి.
త్రిపాఠికి మార్క రమ్ తోడయ్యాడు. ఇక త్రిపాఠి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేకేఆర్ బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండానే బాదడం మొదలు పెట్టాడు.
కేకేఆర్ టాప్ బౌలర్లను వినియోగించినా తట్టుకుని నిలబడ్డాడు త్రిపాఠి.
Also Read : అశ్విన్ ను పంపడంపై సంజయ్ సెటైర్