YS Jagan : ఒంటిమిట్ట సీతారామ స్వామికి పేరొందింది. అద్బుతమైన శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీక ఈ ఆలయం. రాత్రి సీతారామ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో జరిగిన ఈ కార్యక్రమం కనుల పండువగా సాగింది.
ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులు తరించి పులకించి పోయారు. కడప వరకు విమానంలో వచ్చారు సీఎం.
అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఒంటిమిట్టకు చేరుకున్నారు. జగన్ రెడ్డికి(YS Jagan) తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
రాత్రికి చేరుకున్న జగన్ సాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు వేద పండితులు సీఎంకు ఆశీర్వచనం చేసి, మంగళా శాసనాలు అందజేశారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ అర్చకులు ఆలయ మర్యాదాలు పాటించి, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోశ్చారణల నడుమ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది.
తండోప తండాలుగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరికీ కళ్యాణం కనిపించేందుకు గాను భారీ ఎత్తున టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
సకల సౌకర్యాలు కల్పించారు. తిరుమల నుంచి బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వీటీని టీటీడీ చైర్మన్ దంపతులు అందజేశారు. అంతకు ముందు గవర్నర్ దంపతులు సైతం పట్టు వస్త్రాలు సమర్పించడం విశేషం.
Also Read : స్వామి నారాయణ్ ఆలయంలో సీఎంలు