Ramdas Athawale : బహుజన్ సమాజ్ పార్టీ కుమారి మాయావతిపై సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర మంత్ఇర రాందాస్ అథవాలే(Ramdas Athawale ). డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలలను సాకారం చేసే సత్తా తమ పార్టీకి ఉందని ఆయన స్పష్టం చేశారు.
యూపీలో ఆమె పని అయి పోయిందని, ఇదే విషయం ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితమైంది. దీంతో బీఎస్పీకి భవిష్యత్తు లేదన్నారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాందాస్ అథవాలే.
ఇక నుంచి మాయావతి విశ్రాంతి తీసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. ఇక నుంచి దేశ మంతటా అంబేద్కర్ కలలను సాకారం చేసేందుకు తమ పార్టీ ప్రయారిటీ ఇస్తుందన్నారు.
యూపీలో బీఎస్పీకి తాము ఓ ప్రత్యామ్నాయ శక్తిగా తప్పకుండా ఉద్బవిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ తర్వాత రాందాస్ అథవాలే యూపీపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించామన్నారు.
బీఎస్పీని జనం నమ్మడం లేదన్నారు. ప్రజలు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. కాలం చెల్లిన సూత్రాలు, సిద్దాంతాలు వల్లె వేసినంత మాత్రాన ఓట్లు రాలవన్నారు.
భవంతుల్లోకే పరిమితమై పోతే జనం ఎలా మాయవతిని నమ్ముతారంటూ రాందాస్ అథావలే(Ramdas Athawale )ప్రశ్నించారు. గతంలో కంటే ఈసారి ఓటు శాతం కూడా బీఎస్పీకి గణనీయంగా తగ్గిందన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ కన్న కలల్ని నిజం చేసేది తమ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని మాయావతి నుంచి కాదని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి.
Also Read : గాంధీ ఫ్యామిలీతో ప్రశాంత్ కిషోర్ భేటీ